ఎంటర్టైన్మెంట్'సిద్' పాట పాడక పోయినా నష్టం లేదు

‘సిద్’ పాట పాడక పోయినా నష్టం లేదు

ఇప్పుడు తెలుగు చిత్రాల్లో సిద్ శ్రీరామ్ గొంతు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇండియన్ అల్ టైం బ్లాక్ బస్టర్ సామజవరగమనా పాట దగ్గర్నుంచి రాబోయే మగువ మగువా పాట దాకా అన్నీ చార్ట్ బస్టర్లే….గతంలో కూడా ఇంకేం ఇంకేం కావాలె ,ఏ మై పోయావే , ఉండి పోరాదే , యంత్ర లోకపు సుందరివే , నువ్వుంటే నా జతగా అంటూ తన శ్రావ్యమైన గొంతుతో శ్రోతల్ని మైమరిపించాడు. అలాగే రాబోయే లో- బడ్జట్ చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ లో కూడా నీలి నీలి ఆకాశం అంటూ తన గానం తో మెస్మరైజ్ చేస్తున్నాడు. అలా చిన్నా చితకా సినిమాల్లో కూడా సిద్ శ్రీరామ్ తో పాట పాడించడం పరిపాటి అయిపోయింది. సిద్ పాట పాడితే దానికి యూత్ లో ఆకర్షణ ఉండడం తో వేరే సింగర్ల కంటే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నా కానీ సిద్ శ్రీరాంతో పాట పాడిస్తున్నారు. తమన్ కి కూడా సిద్ శ్రీరామ్ రేంజ్ ఏమిటో సామజవరగమనా పాటతో తెలిసి వచ్చింది. అందుకే వకీల్ సాబ్ లో మగువ మగువ పాటని అతనితోనే పాడించాడు.

ఇంత పాపులర్ ఫిగర్ అయినా గాని దేవిశ్రీ ప్రసాద్ మాత్రం సిద్ శ్రీరామ్ తో పాట పాడించుకోవడం లేదు. సిద్
శ్రీరామ్ లేకుండానే హిట్ సాంగ్స్ చేయాలని, తన సత్తా చూపించాలని దేవి శ్రీ ప్రసాద్ బాగా ట్రై చేస్తున్నాడు. ఆ క్రమం లో ఉప్పెనలో వచ్చిన రెండు పాటలు సిద్ శ్రీరామ్ పాడకపోయినా కానీ సూపర్ హిట్ అయ్యాయి. నీ కన్ను నీలి సముద్రం , ధక్ ధక్ ధక్ అనే పాట ఇపుడు సంగీత ప్రియులకు శ్రవణ పేయాలయ్యాయి .ఆ లెక్కన దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో సిద్ శ్రీరామ్ పాడితే ఎలా ఉంటుందో వినాలనే సంగీత ప్రియులు కోరిక ఇప్పట్లో తీరేలా లేదు .
Confidence is his strength

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

AR Rahman: టాలీవుడ్ లో తమన్ శకం ఇక ముగిసినట్టేనా..? AR రెహమాన్ కోసం క్యూలు కడుతున్న నిర్మాతలు!

AR Rahman: మన టాలీవుడ్ లోనే కాదు, ఏ ఇండస్ట్రీ లో అయినా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎల్లప్పుడూ చార్ట్ బస్టర్ సాంగ్స్ ని అందిస్తూనే ఉండాలి. ఒకటి రెండు సినిమాలు తేడా కొట్టినా...

Ellamma Movie : ఎల్లమ్మ లో దేవి శ్రీ ప్రసాద్ క్యారెక్టర్ ఇదేనా..? ఎల్లమ్మకి అతనికి సంబంధం ఏంటంటే..?

Ellamma Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. పాన్ ఇండియాలో మన స్టార్ హీరోలు సైతం సక్సెస్ లను సాధిస్తూ తమకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్...

Most Popular

Tollywood Directors: రైటర్ గా ఫెయిల్ అయి డైరెక్టర్ గా సక్సెస్ అయిన దర్శకులు వీళ్లే…

Tollywood Directors: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు తమకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకుంటారు. సినిమా సక్సెస్ లో వాళ్ళు కీలకపాత్ర వహిస్తూ ఉంటారు. ప్రతి సీన్ ను వాళ్ళు...

Jana Nayagan: ఓవర్సీస్ లో నిరాశపరుస్తున్న ‘జన నాయగన్’ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇంత తక్కువ గ్రాస్ ఊహించలేదు..

Jana Nayagan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. జనవరి 9 న విడుదల అవ్వాల్సిన...

OG TV Telecast: ఎట్టకేలకు టీవీ టెలికాస్ట్ కి సిద్దమైన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’.. ఏ ఛానల్...

OG TV Telecast: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'ఓజీ ' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఉన్నటువంటి పొలిటికల్ కమిట్మెంట్స్ కి , ఇలాంటి భారీ...

Hyper Aadi: ‘జబర్దస్త్’ లోకి హైపర్ ఆది గ్రాండ్ రీ ఎంట్రీ.. ఒక్కో ఎపిసోడ్ కి ఎంత రెమ్యూనరేషన్...

Hyper Aadi: ఈటీవీ లో ప్రసారమయ్యే 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయమైన విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వారిలో ముఖ్యంగా...

The Paradise: నాని రేంజ్ మారిపోయిందా…నెక్స్ట్ సినిమా రెమ్యునరేషన్ పెంచేశాడుగా…

The Paradise: 'అష్టా చమ్మా' సినిమాతో హీరోగా మారిన నాని ప్రస్తుతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు టాప్ లెవెల్లో ఉన్నాయి. ఇప్పుడు...
Exit mobile version