Yellamma Movie Glimpse : యంగ్ హీరోల్లో ప్రస్తుతం నితిన్(Actor Nithin) పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భీష్మ తర్వాత ఈ హీరో చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రాబిన్ హుడ్ ‘, ‘తమ్ముడు’ చిత్రాలు ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. నితిన్ మార్కెట్ ని పూర్తిగా దెబ్బ తీసిన సినిమాలు ఇవి. ‘తమ్ముడు’ చిత్రానికి దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా తర్వాత చేయబోయే ‘ఎల్లమ్మ’ లో కూడా హీరో నితిన్ అని ప్రకటించాడు దిల్ రాజు. అప్పట్లో తమ్ముడు మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా నితిన్, దిల్ రాజు ‘ఎల్లమ్మ'(Yellamma Movie) గురించి మాట్లాడుకోవడం మనం చూసాము. అయితే ‘తమ్ముడు’ ఘోరమైన డిజాస్టర్ అవ్వడంతో అసలు మొహమాటం అనేదే లేకుండా నితిన్ ని ఆ చిత్రం నుండి తప్పించేసాడు దిల్ రాజు.
ఇక ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ని ‘ఎల్లమ్మ’ లో హీరో గా తీసుకున్నామని చెప్పుకొచ్చాడు దిల్ రాజు. నేడు సంక్రాంతి కానుకగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ వీడియో ని విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియో చూసిన తర్వాత అబ్బో, ఎంత బాగుంది, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది, క్వాలిటీ కూడా అదుర్స్, దేవి శ్రీ ప్రసాద్ మంచి కల్ట్ సినిమాతోనే హీరో గా లాంచ్ అవ్వబోతున్నారు అంటూ ఈ గ్లింప్స్ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయం లో బంగారం లాంటి ప్రాజెక్ట్ నుండి తప్పుకొని నితిన్ చాలా పెద్ద పొరపాటు చేసాడు. ఈ సినిమా ఆయన చేసుంటే పెద్ద కం బ్యాక్ మూవీ అయ్యేది అంటూ చెప్పుకొచ్చారు. నితిన్ కి ప్రస్తుతం బ్యాడ్ లక్ మాములు రేంజ్ లో లేదని అంటున్నారు.
ఇప్పుడు నితిన్ తన తదుపరి చిత్రం ఎవరితో చేయబోతున్నాడో ఎవరికీ తెలియని పరిస్థితి. నిర్మాతలు నితిన్ తో సినిమా తీసేందుకు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఇష్క్ చిత్రానికి ముందు నితిన్ పరిస్థితి ఎలా ఉండేదో, ఇప్పుడు కూడా ఆయన పరిస్థితి అలా ఉంది. వరుసగా 14 ఫ్లాపులు అందుకొని అప్పట్లో మార్కెట్ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు నితిన్. ఇష్క్ తో కం బ్యాక్ ఇచ్చి, మరో రెండు మూడు భారీ బ్లాక్ బస్టర్స్ ని అందుకొని తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని, మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆ విషయం లో నితిన్ ఎంతో ఆదర్శవంతుడు అనొచ్చు. ఇప్పుడు ఆయన కం బ్యాక్ ఇచ్చి, పోయిన తన మార్కెట్ ని తిరిగి వెనక్కి రప్పించుకుంటాడో లేదో చూడాలి.