కెరీర్ ఆరంభంలో సరైన హిట్ సినిమాలు లేక ఇబ్బందిపడి ఆ తరవాత నిలదొక్కు కొన్న వాళ్ళు ఎందరో ఉన్నారు. జగపతి బాబు కెరీర్ ఆరంభంలో సుమారు ఎనిమిది ప్లాప్ చిత్రాలను చవి చూసాడు. అలాగే హీరోయిన్ రమ్యకృష్ణ కెరీర్ ఆరంభం లో పదిహేడు సినిమాలు చేస్తే వాటిలో చక్రవర్తి ( చిరంజీవి చెల్లి ),సూత్రధారులు అనే సినిమాలు మాత్రమే ఒక మోస్తరు విజయాన్ని చవి చూశాయి. ఆ తరవాతే అల్లుడుగారు చిత్రం తో స్టార్ హీరోయిన్ అయ్యింది . .
అలాగే ముగమూడి (తెలుగులో మాస్క్ ) చిత్రం తో కెరీర్ ఆరంభించిన పూజా హెగ్డే కి వరుసగా ముకుంద , ఒక లైలా కోసం ,మొహెంజో దారో వంటి ప్లాప్ చిత్రాలు వచ్చాయి. ఆ తరవాత దువ్వాడ జగన్నాధం వంటి యావరేజ్ చిత్రం వచ్చింది ఆ తరవాత మళ్ళీ సాక్ష్యం చిత్రం వచ్చి అపజయం పాలైంది ..అరవింద సమేత , మహర్షి , గద్దలకొండ గణేష్,హౌస్ ఫుల్ 4 వంటి చిత్రాలు హిట్ అయినా పెద్ద ఉపయోగం కలగ లేదు. అలా పూజా హెగ్డే కి సరైన హిట్ లేదు అని మాట్లాడేవాళ్ళకి ” అల వైకుంఠపురములో” బ్లాక్ బస్టర్ సక్సెస్ తో నోళ్లు మూతలు పడ్డాయి. ఇప్పుడు ఆమెకి తెలుగు చిత్ర సీమలో ఫుల్ డిమాండ్ ఉంది. అదే సమయంలో బాలీవుడ్ లో కూడా పూజా హెగ్డే కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఇప్పుడు సల్మాన్ ఖాన్ హీరోగా ” కభీ ఈద్ కభీ దీవాలి ” అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. సల్మాన్ పక్కన యువ నటీమణులకు అవకాశం ఇస్తే పారితోషికం పెద్దగా ఇవ్వరు. కానీ పూజా హెగ్డే బాగా బిజీ కావడంతో ఏకంగా నాలుగు కోట్ల రూపాయలు ఆఫర్ ఇచ్చారు..
ఒక రకంగా ఇది తెలుగు నిర్మాతలకు ఇబ్బంది కలిగించే విషయమే . ఎందుకంటే తెలుగులో ఆమె పారితోషికం ఇంత వరకు కోటిన్నర దాటలేదు. హిందీలో ఇస్తున్నారని ఆమె ఇక్కడ రేట్ పెంచేస్తే హీరోయిన్ గా ఇక్కడ ఛాన్సులు తగ్గుతాయి.ఇక సల్మాన్ సినిమా హిట్ అయిందంటే మాత్రం మునుపటిలా పూజా హెగ్డే తెలుగులో రెగ్యులర్ గా కనిపించక పోవచ్చు
Every dog has it’s own day