Bheems Ceciroleo: ఒక సినిమా సక్సెస్ అవ్వడానికి హీరో, డైరెక్టర్లతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా కీలకపాత్ర వహిస్తాడు. ఆయన ఇచ్చిన మ్యూజిక్ తోనే సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళుతుంది… ముందుగా ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించడానికి సినిమాలోని పాటలు బాగుండాలి. అలా ఉంటేనే ప్రేక్షకుడు థియేటర్ కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు వాళ్ళ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సాధించడానికి ప్రయత్నం చేస్తుంటారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దేవిశ్రీప్రసాద్ ప్రస్తుతం హీరోగా మారుతున్నాడు. కాబట్టి తను మ్యూజిక్ అందించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోల సినిమాలన్నింటితో మ్యూజిక్ ని అందించి గొప్ప విజయాలను అందుకున్నాడు.
అలాంటి ఆయన ఇప్పుడు తను హీరోగా మారి సినిమా చేస్తుండడం వల్ల అతని నుంచి ఎక్కువ సంఖ్యలో మ్యూజిక్ ని ఆశించడం పెద్ద తప్పు అవుతుంది. ఇక ఇప్పటికే జీవి ప్రకాష్ కుమార్, విజయ్ ఆంటోనీ లాంటి మ్యూజిక్ డైరెక్టర్లు సైతం హీరోలుగా మరి రాణిస్తున్నారు…మరి ఇలాంటి క్రమంలోనే ఎల్లమ్మ సినిమాతో దేవిశ్రీప్రసాద్ ఎలాంటి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంటాడనేది తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ మ్యూజిక్ డైరెక్టర్ ని ఇప్పటికే బీట్ చేస్తూ అతని ప్లేస్ ని భర్తీ చేయడానికి భీమ్స్ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సంక్రాంతికి వచ్చిన 5 సినిమాల్లో రెండు సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ ని అందించాడు. ‘మన శంకర్ వరప్రసాద్’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ లాంటి సినిమాలు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆయన మ్యూజిక్ ఇచ్చిన సినిమాలోని సాంగ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయి.
సినిమా విజయంలో ఆయన పాటలు కూడా కీలకపాత్ర వహించాయనే చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటివరకు దేవిశ్రీప్రసాద్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నాడు. నిజానికి ఈ 26 సంవత్సరాల కాలంలో దేవి అద్భుతమైన ఆల్బమ్స్ ను అందించాడు… అలాంటి దేవిని బీట్ చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. భీమ్స్ అతన్ని ఎలా బీట్ చేస్తాడు అనేది చూడాలి…
