ఇప్పుడు తెలుగు చిత్రాల్లో సిద్ శ్రీరామ్ గొంతు ఒక ప్రత్యేక ఆకర్షణ. ఇండియన్ అల్ టైం బ్లాక్ బస్టర్ సామజవరగమనా పాట దగ్గర్నుంచి రాబోయే మగువ మగువా పాట దాకా అన్నీ చార్ట్ బస్టర్లే….గతంలో కూడా ఇంకేం ఇంకేం కావాలె ,ఏ మై పోయావే , ఉండి పోరాదే , యంత్ర లోకపు సుందరివే , నువ్వుంటే నా జతగా అంటూ తన శ్రావ్యమైన గొంతుతో శ్రోతల్ని మైమరిపించాడు. అలాగే రాబోయే లో- బడ్జట్ చిత్రం 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ లో కూడా నీలి నీలి ఆకాశం అంటూ తన గానం తో మెస్మరైజ్ చేస్తున్నాడు. అలా చిన్నా చితకా సినిమాల్లో కూడా సిద్ శ్రీరామ్ తో పాట పాడించడం పరిపాటి అయిపోయింది. సిద్ పాట పాడితే దానికి యూత్ లో ఆకర్షణ ఉండడం తో వేరే సింగర్ల కంటే చాలా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నా కానీ సిద్ శ్రీరాంతో పాట పాడిస్తున్నారు. తమన్ కి కూడా సిద్ శ్రీరామ్ రేంజ్ ఏమిటో సామజవరగమనా పాటతో తెలిసి వచ్చింది. అందుకే వకీల్ సాబ్ లో మగువ మగువ పాటని అతనితోనే పాడించాడు.
ఇంత పాపులర్ ఫిగర్ అయినా గాని దేవిశ్రీ ప్రసాద్ మాత్రం సిద్ శ్రీరామ్ తో పాట పాడించుకోవడం లేదు. సిద్
శ్రీరామ్ లేకుండానే హిట్ సాంగ్స్ చేయాలని, తన సత్తా చూపించాలని దేవి శ్రీ ప్రసాద్ బాగా ట్రై చేస్తున్నాడు. ఆ క్రమం లో ఉప్పెనలో వచ్చిన రెండు పాటలు సిద్ శ్రీరామ్ పాడకపోయినా కానీ సూపర్ హిట్ అయ్యాయి. నీ కన్ను నీలి సముద్రం , ధక్ ధక్ ధక్ అనే పాట ఇపుడు సంగీత ప్రియులకు శ్రవణ పేయాలయ్యాయి .ఆ లెక్కన దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో సిద్ శ్రీరామ్ పాడితే ఎలా ఉంటుందో వినాలనే సంగీత ప్రియులు కోరిక ఇప్పట్లో తీరేలా లేదు .
Confidence is his strength