https://oktelugu.com/

Devara Pre Release Event: బిగ్ బ్రేకింగ్ : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..కన్నీళ్లు పెట్టుకున్న ఎన్టీఆర్..వైరల్ అవుతున్న వీడియో!

హైదరాబాద్ లోని నోవొటెల్ హోటల్ లో ఈ ఈవెంట్ ని ప్లాన్ చేయడం తో బెడిసికొట్టింది. కేవలం 5 వేల మంది మాత్రమే సరిపడే కెపాసిటీ ఉన్న ఈ ఆడిటోరియం లో ఈవెంట్ ని ప్లాన్ చేయాలనుకోవడమే పెద్ద తప్పు. అయితే ఎన్టీఆర్ నుండి ఆరేళ్ళ తర్వాత విడుదల అవుతున్న సోలో చిత్రం కావడంతో అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భారీ గా హాజరు అయ్యారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 23, 2024 / 07:51 AM IST

    Devara Pre Release Event

    Follow us on

    Devara Pre Release Event: ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ మరో నాలుగు రోజుల్లో మన ముందుకు రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసారు మేకర్స్. హైదరాబాద్ లోని నోవొటెల్ హోటల్ లో ఈ ఈవెంట్ ని ప్లాన్ చేయడం తో బెడిసికొట్టింది. కేవలం 5 వేల మంది మాత్రమే సరిపడే కెపాసిటీ ఉన్న ఈ ఆడిటోరియం లో ఈవెంట్ ని ప్లాన్ చేయాలనుకోవడమే పెద్ద తప్పు. అయితే ఎన్టీఆర్ నుండి ఆరేళ్ళ తర్వాత విడుదల అవుతున్న సోలో చిత్రం కావడంతో అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భారీ గా హాజరు అయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 30 వేల మంది ఈ ఈవెంట్ కి హాజరయ్యారట. ఒక్కసారిగా ఇంతమంది రావడంతో పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు.

    దీంతో నోవొటెల్ హోటల్ వద్ద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అభిమానులు లోపలకు దూసుకొని వచ్చేసారు. సెలబ్రిటీస్ కూర్చునే చోటకి వచ్చి కూర్చొని రచ్చ రచ్చ చేసారు. పోలీసులు వాళ్ళను చెదరగొట్టారు, చాలా మంది అభిమానులకు రక్తాలు కూడా కారాయి. అలా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం లో జరగాల్సిన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ రసాభాసగా మారిపోయింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విచారం వ్యక్తం చేస్తూ కాసేపటి క్రితమే వీడియో విడుదల చేసారు.

    ఆయన మాట్లాడుతూ ‘దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయ్యినందుకు నాకు చాలా బాధగా ఉంది. ముఖ్యంగా మీకంటే నాకే ఎక్కువ బాధ, చాలా కాలం తర్వాత అభిమానులతో కలిసి జరుపుకునే పండుగ ఇది. కానీ సెక్యూరిటీ కారణాల చేత రద్దు చేయాల్సి వచ్చింది. దీనికి ఈవెంట్ ఆర్గనైజర్స్ ని కానీ, లేదా పోలీసులను కానీ తప్పుబట్టాల్సిన అవసరం లేదు, అది చాలా తప్పు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన. అయితే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యుండొచ్చు కానీ, సెప్టెంబర్ 27 న ‘దేవర’ చిత్రం మీ ముందుకు రాబోతుంది. మీరు చూపించే ఈ ప్రేమకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను. నేను మీ అందరికి కాలర్ ఎగరేసుకునే సినిమాలను మాత్రమే ఇస్తానని చెప్పాను. సెప్టెంబర్ 27 న అది జరుగుతుందని ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. కొరటాల శివ గారు ఎంతో కసి తో, కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అందరూ చూడండి, అందరూ ఆనందించండి, అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీస్సులు నాకు, మా సినిమాకి అవసరం, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఇక చివరగా మీరందరు ఎంతో దూరం నుండి ఈ ఈవెంట్ కి వచ్చారు. జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్ళండి. ఇక సెలవు, జై ఎన్టీఆర్’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయితే అభిమానులు మాత్రం ఇప్పుడు కాకపోయినా మరో రెండు రోజుల తర్వాత అయినా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి నిర్మాతలు ప్లాన్ చేస్తారో లేదో చూడాలి.