https://oktelugu.com/

Devara Movie: దేవరను బాలీవుడ్ లో రిలీజ్ చేయనున్న భారీ ప్రొడ్యూసర్…

టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమాను బాలీవుడ్ లో ఎవరు రిలీజ్ చేస్తారు అనే ప్రశ్న మొదటి నుంచి ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులలో కూడా మెదులుతూ వచ్చింది.

Written By:
  • Gopi
  • , Updated On : April 10, 2024 / 05:42 PM IST

    Karan Johar buys Devara Movie Bollywood right

    Follow us on

    Devara Movie: ఒక సినిమాని తీయడం ఒక ఎత్తైతే దానిని సరైన టైమ్ కి, ఎక్కువ థియేటర్లలో రిలీజ్ చేయడం మరొక ఎత్తు..కొన్ని సినిమాలు బాగున్నప్పటికీ వాటి రిలీజ్ డేట్ గాని, వాటికి తగినంత థియేటర్లు దొరక్క పోవడం వల్ల గాని ఆ సినిమాలు ఆశించిన విజయాలను అందించలేక పోతాయి. ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న దేవర సినిమాను బాలీవుడ్ లో ఎవరు రిలీజ్ చేస్తారు అనే ప్రశ్న మొదటి నుంచి ఎన్టీఆర్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులలో కూడా మెదులుతూ వచ్చింది. కానీ ఎట్టకేలకు ఈ సినిమాని హోల్ సేల్ రేట్ కి ప్రముఖ నిర్మాత ధర్మ మూవీస్ అధినేత “కరణ్ జోహార్” దక్కించుకున్నాడు. ఇక ఈయన తో పాటు ఏఏ సినిమాస్ ఇండియా వాళ్లు కూడా ఇందులో పార్ట్నర్స్ అవడం విశేషం..

    ఇక తెలుగు సినిమాలను బాలీవుడ్ లో రిలీజ్ చేయడానికి కరణ్ జోహార్ ఎప్పుడు ముందుంటాడు. ఇక రాజమౌళి తీసిన బాహుబలి సినిమాని కూడా తనే రిలీజ్ చేయడం విశేషం.. ఆ సినిమాతో అక్కడ ఆయనకు భారీగా లాభాలైతే వచ్చాయి. ఇక అప్పటినుంచి ఆయన తెలుగులో వచ్చే పెద్ద సినిమాలని టార్గెట్ చేస్తూ ఆయన అనుకున్న రేట్ కి కనక రైట్స్ అనేవి దొరికితే రిలీజ్ చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీగా ఉంటున్నాడు. ఇక అందులో భాగంగానే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘లైగర్ ‘ సినిమా ని కూడా తనే రిలీజ్ చేశాడు.

    ఇక ఈ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో ఆయనకు భారీగా నష్టాలైతే వచ్చాయి.ఇక అప్పటినుంచి ఆచితూచి మరి ఆయన తెలుగు సినిమాలని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒకసారి ఆయన చేతిలోకి సినిమా వెళ్లిందంటే ఆ సినిమాకు భారీ ప్రమోషన్స్ చేస్తూనే, చాలా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కూడా చేస్తూ ఉంటాడు. తద్వారా దేవర సినిమాకి ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ సినిమా ద్వారా ఎన్టీయార్ కి, కొరటాల శివ కి ఎంత పేరైతే వస్తుందో అంతకుమించి కరణ్ జోహార్ కి పేరు డబ్బులు కూడా వస్తాయనే ఉద్దేశ్యం లోనే తను ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది.

    ఇక మొత్తానికైతే ఎన్టీఆర్ కి బాలీవుడ్ లో ఒక సాలిడ్ ఎంట్రీ దక్కనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఒక సినిమాని రిలీజ్ చేసినప్పటికీ అందులో ఇద్దరు హీరోలు ఉండటం వల్ల ఎన్టీఆర్ కి అంత క్రెడిబిలిటీ అయితే రాలేదు. ఇక ఇప్పుడు సోలో హీరోగా వస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో భారీ హిట్టు దక్కించుకొని అక్కడ స్టార్ హీరోగా గుర్తింపు పొందాలని చూస్తున్నాడు..