https://oktelugu.com/

Devara Movie: దేవరలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కనిపించనున్న స్టార్ హీరో…

మూడో తరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీయార్ కూడా మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీ లో తనకేవరు సాటిలేరు అని ప్రూవ్ చేసుకుంటూ ముందుకు దుసుకెళ్తున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 10, 2024 / 12:38 PM IST

    Vishwak Sen in Devara movie flashback episode

    Follow us on

    Devara Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ నుంచి “విశ్వ విఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు” ఇండస్ట్రీకి వచ్చి తనదైన గుర్తింపు సంపాదించుకొని తెలుగు సినిమా స్థాయిని పెంచిన నటుడిగా ఇప్పటికీ ఆయన పేరును చెప్పుకుంటూ ఉంటాం. ఇక ఆయన తర్వాత బాలకృష్ణ వచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు.

    ఇక మూడో తరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీయార్ కూడా మంచి విజయాలను అందుకుంటూ ఇండస్ట్రీ లో తనకేవరు సాటిలేరు అని ప్రూవ్ చేసుకుంటూ ముందుకు దుసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతానికైతే నందమూరి ఫ్యామిలీ భాధ్యత మొత్తాన్ని తనే మోస్తున్నాడు. అందువల్లే వీళ్ల ఫ్యామిలీకి సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఎన్టీయార్ దేవర అనే సినిమా చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీయార్ సరికొత్త గా కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఎన్టీఆర్ పాన్ ఇండియాలో సోలో హీరోగా వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా మీద ఎన్టీఆర్ భారీ అంచనాలను పెట్టుకున్నాడు. ఇక దాంతో పాటుగా రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ కూడా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచుతుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చాలా రిచ్ గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో ఎన్టీయార్ తమ్ముడిగా విశ్వక్ సేన్ నటించ బోతున్నట్టుగా తెలుస్తుంది.

    నిజానికి విశ్వక్ సేన్ మంచి నటుడు కాబట్టే ఎన్టీయార్ పట్టుబట్టి మరీ ఆ క్యారెక్టర్ లో విశ్వక్ సేన్ ను నటింపజేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయాన్ని ఇప్పటి వరకు సస్పెన్స్ లోనే ఉంచుతున్నారు. ఇక ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే రోజు కూడా దగ్గర్లోనే ఉన్నట్టుగా సినిమా యూనిట్ నుంచి ఒక న్యూస్ అయితే లీక్ అయింది…