https://oktelugu.com/

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో గబ్బర్ సింగ్ లోని సూపర్ హిట్ సాంగ్ ను వాడుతున్నారా..?

పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు ఎవరు చేయలేని విధంగా "గబ్బర్ సింగ్" అనే ఒక సినిమా చేసి ఆయన పొటెన్షియల్టి మొత్తాన్ని బయటికి తీసి సక్సెస్ ని అందుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : April 10, 2024 / 06:06 PM IST

    Gabbar Singh super hit song in Ustad Bhagat Singh

    Follow us on

    Ustaad Bhagat Singh: కమర్షియల్ సినిమా అనగానే మనకు కొంతమంది డైరెక్టర్లుకు గుర్తుకు వస్తారు. తెలుగులో చాలామంది కమర్షియల్ డైరెక్టర్లు ఉన్నప్పటికి అందులో ది బెస్ట్ సినిమాలను తీసే వాళ్ళు మాత్రం మహా అయితే ఒక ఐదారుగురు మాత్రమే ఉంటారు అందులో హరీష్ శంకర్ ఒకరు. కమర్షియల్ సినిమా లో ఉండే ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఏది పడాలి అనేది పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రణాళికలను రూపొందించుకొని సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు.

    ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తో ఇంతకు ముందు ఎవరు చేయలేని విధంగా “గబ్బర్ సింగ్” అనే ఒక సినిమా చేసి ఆయన పొటెన్షియల్టి మొత్తాన్ని బయటికి తీసి సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు అదే కాంబో ను రిపీట్ చేస్తూ “ఉస్తాద్ భగత్ సింగ్” అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా అలరించింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

    ఇక అందులో భాగంగానే హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలోని ఒక సూపర్ హిట్ సాంగ్ ని ఈ సినిమాలో ఒక ట్రాక్ కోసం వాడుకోబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అది ఏ సాంగ్ అంటే “పిల్ల నువ్వు లేని జీవితం” అనే సాంగ్ ని ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ మధ్య వచ్చే ఒక సీన్ లో వన్ మినిట్ వరకు ఈ సాంగ్ ని వాడుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సాంగ్ గురించి చెప్పాలంటే ఈ పాట ఇప్పటికీ కూడా చాలా పాపులర్ గా నిలుస్తుంది.

    ఎందుకంటే రీసెంట్ గా ఐపిఎల్ లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో స్టేడియంలో ఈ పాట వేస్తే ప్రతి అభిమాని కూడా ఎవరి చైర్ దగ్గర వాళ్ళు లేచి నిలబడి డ్యాన్సులు వేస్తున్నారు అంటే ఈ పాటకి ఇప్పటికీ కూడా ఎంత క్రేజ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆ క్రేజ్ ని వాడుకోవడానికే ఈ సినిమాలో ఈ పాటను పెడుతున్నట్టుగా తెలుస్తుంది…