https://oktelugu.com/

Sarkaru Vaari Paata: ఫిదా, సర్కారు వారి పాట సినిమాల్లో ఈ మిస్టేక్స్ ను గమనించారా?

తాజాగా విడుదలైన సినిమాల్లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి. అయితే సర్కారు వారి పాట సినిమా గురించి తెలియని వారు ఉండరు. మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 10, 2024 / 05:28 PM IST

    Sarkaru Vaari Paata

    Follow us on

    Sarkaru Vaari Paata: ఎంత పెద్ద డైరెక్టర్ అయినా మిస్టేక్ చేయడం కామన్. కానీ పాత సినిమాల్లో వీటిని కనిపెట్టి చెప్పడం కష్టంగా ఉండేది. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఎంత చిన్న మిస్టక్ ఉన్నా సరే ఇట్టే పట్టేస్తున్నారు నెటిజన్లు. అక్కడి తోనే ఆగుతున్నారా? ట్రోల్స్ తో సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటారు. మరి ఇలాంటి మిస్టేక్స్ జరిగిన సినిమాల గురించి ఓ సన్నివేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

    తాజాగా విడుదలైన సినిమాల్లో కూడా చాలా మిస్టేక్స్ ఉంటున్నాయి. అయితే సర్కారు వారి పాట సినిమా గురించి తెలియని వారు ఉండరు. మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను అందుకుంది. అయితే ఇందులో కీర్తి సురేష్ మహేష్ బాబు వద్ద 25 డాలర్లు అప్పు తీసుకుంటే.. మహేష్ బాబు మాత్రం పదివేల డాలర్లు అప్పు ఇచ్చాను అంటాడు. అవి తిరిగి ఇవ్వాలి అంటారు. అంటే ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు దర్శకుడు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు.

    వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబోలో వచ్చిన సినిమా. ఫిదా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే కానీ ఇందులో కూడా మిస్టేక్ ఉంది. వరుణ్ ఎన్నారై పాత్రలో నటిస్తే.. సాయి పల్లవి పక్కా తెలంగాణ అమ్మాయి. అదే స్లాంగ్ లో మాట్లాడుతుంది కూడా. ఇక అన్నతో కలిసి అమెరికాలో జీవిస్తాడు మన హీరో. సాయి పల్లవి అక్క వరుణ్ సోదరుడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది. అయితే ఒక సీన్ లో సాయి పల్లవి అక్కతో ఫోన్ మాట్లాడుతుంది. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఓ మిస్టేక్ మాత్రం ఉంది.

    అమెరికాలో డే ఉంటే ఇండియాలో చీకటి అవ్వాలి. కానీ ఈ సీన్ లలో రెండు డే లు గానే చూపిస్తారు. ఎక్కడో ఒక దగ్గర రాత్రి సీన్ ను చూపించాలి కదా. ఈ చిన్న లాజిక్ ను ఎలా మర్చిపోయారు దర్శకుడు అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. మరి శేఖర్ కమ్ముల ఏదైనా రిప్లై ఇస్తారో చూడాలి.