Rohit Sharma – Ganguly: ఓ బాలీవుడ్ సినిమాలో గంగూలీ, రోహిత్ నటిస్తున్నారనే వార్త సోషల్ మీడియాని షేక్ చేసింది. అయితే, కమెడియన్ కపిల్ శర్మ పోస్ట్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కపిల్ తన కొత్త ప్రాజెక్ట్ ‘మెగా బ్లాక్ బస్టర్’కి సంబందించి ఒక అప్ డేట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ల్లో మ్యాటర్ ఏమిటంటే.. ఈ సినిమా ట్రైలర్‌ను సెప్టెంబర్ 4న విడుదల చేయనున్నట్టు కపిల్ తెలియజేసాడు.

ఈ సందర్భంగా ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేస్తూ.. ‘ఇది నా అభిమానుల కోసం. మీ అందరికీ ఇది నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని కపిల్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే, కపిల్ శర్మతో పాటు దీపికా పదుకొణె కూడా ఈ మెగా బ్లాక్‌బస్టర్ పోస్టర్‌ను పంచుకోవడం ఆసక్తిని కలిగిస్తోంది. పైగా వీరు మెగా బ్లాక్ బస్టర్ అనే హ్యాష్ ట్యాగ్ తో ‘సర్‌ప్రైజ్’ అని క్యాప్షన్ కూడా ఇవ్వడం విశేషం.

ఇక రోహిత్ శర్మ, రష్మిక మందన్న, త్రిష కూడా తమ సోషల్ మీడియా ఖాతాలలో ‘మెగా బ్లాక్‌బస్టర్’ పోస్టర్‌ను పంచుకున్నారు. అయితే, గంగూలీ మాత్రం ఈ సినిమా గురించి ఇంకా స్పందించలేదు. కాకపోతే.. దాదా కూడా కీ రోల్ ప్లే చేస్తున్నారు. దాదాకి సంబంధించిన పోస్టర్ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ కూడా నెట్టింట విపరీతంగా వైరల్ అయింది.

మొత్తానికి ఒకప్పుడు మైదానంలో సిక్సర్లతో హోరెత్తించిన సౌరవ్ గంగూలీ, ప్రస్తుతం సిక్సర్లతో హోరెత్తిస్తున్న రోహిత్ శర్మ కలిసి ఒకే సినిమాతో సినీ రంగ ప్రవేశం చేయడం విశేషం. పైగా ‘మెగా బ్లాక్ బస్టర్’ పోస్టర్ గురించి రోహిత్ శర్మ పోస్ట్ చేసిన మెసేజ్ కూడా బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇంతకీ రోహిత్ ఏం పోస్ట్ చేశాడో తెలుసా ?,
రోహిత్ మాటల్లోనే.. ‘నా కడుపులో సీతాకోకచిలుకలు పరుగెడుతున్నాయి. కారణం.. సినిమాల్లోకి నా అరంగేట్రం చాలా కొత్తగా ఉంది. మెగా బ్లాక్ బస్టర్ పోస్టర్ సెప్టెంబర్ 4న విడుదల కాబోతుంది’ అంటూ రోహిత్ మెసేజ్ చేశాడు. ఇక ఈ పోస్టర్‌లో హాఫ్ షర్ట్‌తో సాఫ్ట్‌వేర్ గెటప్‌లో రోహిత్ శర్మ ఆకట్టుకున్నాడు. అయితే ఇది అసలు సినిమానా ? లేక టెలివిజన్ షోనా అనేది ఇంకా క్లారిటీ లేదు.