Homeఎంటర్టైన్మెంట్Overseas Dacoit movie bookings: ఓవర్సీస్ లో 'డెకాయిట్' కి సెన్సేషనల్ బుకింగ్స్.. ఈ రేంజ్...

Overseas Dacoit movie bookings: ఓవర్సీస్ లో ‘డెకాయిట్’ కి సెన్సేషనల్ బుకింగ్స్.. ఈ రేంజ్ అసలు ఊహించలేదు..

Overseas Dacoit movie bookings: ‘హిట్ 2’ తర్వాత దాదాపుగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అడివి శేష్(Adivi Sesh) మన ముందుకు ‘డెకాయిట్'(Dacoit Movie) చిత్రం ద్వారా రాబోతున్నాడు. విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ లతో ఈ చిత్రం కంటెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అడివి శేష్ సినిమా అంటే ఈ మాత్రం ఉండాలి, మరోసారి సరికొత్త కాన్సెప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు అంటూ నెటిజెన్స్ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరోపక్క అడివి శేష్ వరుసగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంటూ , క్షణ కాలం తీరిక లేకుండా గడుపుతున్నాడు . సోషల్ మీడియా లో ఓపెన్ చేసి చూస్తే చాలు , ప్రస్తుతం అడివి శేష్ మాత్రమే ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు . ఆ రేంజ్ లో ఈ మూవీ ప్రొమోషన్స్ జరుగుతున్నాయి. ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ నార్త్ అమెరికా లో మొదలైంది.

బుకింగ్స్ ట్రెండ్ మామూలు రేంజ్ లేదు. ఊపు చూస్తుంటే కచ్చితంగా ఈ చిత్రం ప్రీమియర్స్ నుండే హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్ ని కొల్లగొట్టేలా ఉందని అంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు. వాళ్ళు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి గడిచిన 24 గంటల్లో 65 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. ఈమధ్య కాలం లో స్టార్ హీరోలకు కూడ ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఓవర్సీస్ ఆడియన్స్ లో అడివి శేష్ వరుస సూపర్ హిట్ సినిమాలతో ఎలాంటి నమ్మకాన్ని అక్కడి ఆడియన్స్ లో సంపాదించుకున్నాడు అనేది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి పట్టుమని పది కోట్ల బడ్జెట్ కూడా ఖర్చు అయ్యుండదు. కానీ ఊపు చూస్తుంటే కచ్చితంగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజే ఈ చిత్రం 10 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేలా ఉందని అంటున్నారు.

సంక్రాంతి తర్వాత సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ కి , ఈ చిత్రం రూపం లో భారీ హిట్ నమోదయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కేవలం పాజిటివ్ టాక్ వస్తే చాలు, ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అవుతాయి. ఇకపోతే ఈ చిత్రం లో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ నటించింది. ముందుగా శృతి హాసన్ ని తీసుకున్నారు. అనేక సన్నివేశాలను చిత్రీకరించారు కూడా. ఒక టీజర్ ని కూడా వదిలారు. కానీ ఆమెకు డేట్స్ సమస్య కారణంగా మధ్యలోనే ఈ చిత్రాన్ని వదిలి వెళ్ళిపోయింది. దీంతో మేకర్స్ వెంటనే మృణాల్ ఠాకూర్ ని సంపాదించారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడం తో ఆమె కూడా వెంటనే ఒప్పేసుకుంది. మరి వెండితెర పై వీళ్లిద్దరు కలిసి ఈసారి ఎలాంటి మ్యాజిక్ రీ క్రియేట్ చేయబోతున్నారో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version