Jabardasth Naresh: జబర్దస్త్ నరేష్ అంటే తెలియనివారుండరు. బుల్లితెర ప్రేక్షకుల్లో నరేష్ కి మంచి పాపులారిటీ ఉంది. చాలా కాలంగా నరేష్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో రాణిస్తున్నాడు. జబర్దస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన కమెడియన్స్ నరేష్ కూడా ఒకడని చెప్పొచ్చు. మరుగుజ్జు అయిన నరేష్ అటు చిన్న పిల్లల గెటప్స్ కి ఇటు పెద్దవాళ్ళ గెటప్స్ కి చక్కగా సరిపోతాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఇక పొట్టివాడైనా మంచి హెయిర్ స్టైల్ తో నరేష్ చూడటానికి ముచ్చటగా ఉంటాడు. ఈ గ్లామర్ తో ఆయన ఓ అందమైన అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు.

ఇటీవల నరేష్ ని ప్రేమిస్తున్న అమ్మాయి వెలుగులోకి వచ్చింది. దసరా వైభవం పేరుతో ఈటీవీలో స్పెషల్ ఈవెంట్ రూపొందించారు. ఈ ఈవెంట్ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వేదికపైకి వెళ్లిన ఓ అందమైన అమ్మాయి, నరేష్ అంటే ఇష్టమని చెప్పింది.స్టేజ్ మీదకి సడన్ ఎంట్రీ ఇచ్చిన ఆ అమ్మాయిని నువ్వు ఎవరని అడిగారు. నేను నరేష్ కోసం వచ్చాను, అతన్ని ఇష్టపడుతున్నాని చెప్పి షాక్ ఇచ్చింది.
ఓ ఈవెంట్ కోసం మావూరు వచ్చాడు. నేను బాగున్నానని బుగ్గ కూడా గిల్లాడు. దానికి నరేష్ నాకసలు తెలియదన్నాడు. అనంతరం నన్ను పెళ్లి చేసుకుంటే నా ఫ్యామిలీ వంద మంది అందరకీ సమాధానం చెప్పాలని, నరేష్ అన్నాడు. నువ్వు నా వెనక ఉంటే కోటి మంది సమాధానం చెప్తానని ఆ అమ్మాయి కాన్ఫిడెంట్ గా చెప్పింది. సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది మా వాడికి ఒక ముద్దు ఇస్తావా? అన్నాడు. ఇస్తానని ఆ అమ్మాయి నరేష్ బుగ్గపై ముద్దు పెట్టబోయింది. చేయి అడ్డం పెట్టి నరేష్.. పెళ్లి తర్వాతే ఇవన్నీ అంటూ కామెంట్ చేశాడు.

నరేష్ డైలాగ్ కి సెట్ లోని వారందరూ పెద్దగా నవ్వేశారు. దసరా వైభవం ప్రోమోలో ఇది చూపించారు. మరి ఈ ప్రేమ కథలో నిజం ఉందో లేదో పూర్తి ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు. కాగా ఓ అమ్మాయి డబ్బుల కోసం ప్రేమ నటించి మోసం చేసిందని నరేష్ గతంలో చెప్పాడు. అలాగే నరేష్ కి చాలా కాలం క్రితమే పెళ్లయింది. ఆయన భార్య ఆత్మహత్య చేసుకొని మరణించారు. పిల్లాడిలా కనిపించే నరేష్ వయసు 25 ఏళ్లకు పైనే ఉంటుంది.



[…] […]