Balakrishna Meeting in Vijayawada: వెండితెరపై ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు కొట్టారు బాలయ్య. సిల్వర్ స్క్రీన్ పై ఎన్నో సంచలన విజయాలు నమోదుచేసుకున్నారు. అటు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఒకేసారి సినీ, రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. మరోవైపు స్మాల్ స్క్రీన్ పై కూడా సందడి చేస్తున్నారు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆన్ స్టాపబుల్ హోస్ట్ గా వ్యవహరించారు. ఫస్ట్ సీజన్ ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారు. అయితే ఆహా సంస్థ కార్యక్రమ హోస్ట్ గా బాలక్రిష్ణను సెలెక్ట్ చేసినప్పుడు రకరకాల కామెంట్లు వినిపించాయి. బాలక్రిష్ణ ఏంటీ? వ్యాఖ్యాత ఏమిటి? అన్న వ్యాఖ్యలు వినిపించాయి. అటువంటి వారందరూ నోరు వెళ్లబెట్టేలా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని నడిపించారు. అందరూ ఆశ్యర్యపోయేలా…ఎంతో మంది సెలబ్రిటీలను అలవోకగా హ్యాండిల్ చేశారు. అటు ఎంటర్ టైన్మెంట్ తో పాటు మెసేజికల్ గా మెస్మరైజ్ చేశారు. ఓటీటీ ప్లాట్ ఫారమ్ లో ఆహా సంస్థను అగ్రపథంలో నిలబెట్టారు. అటు టీఆర్పీ రేటింగ్ పరంగా ఆహా మంచి స్థానానికే ఎగబాకింది.

గత ఏడాది ఓటీటీ వేదికగా షో ప్రారంభమైంది. మోహన్ బాబుతో చిట్ చాట్ ప్రారంభించిన బాలయ్య తొలి షోలోనే అదరగొట్టారు. ప్రేక్షకులను కట్టిపడేశారు. అటు అతిథులను ఆటపట్టించడమే కాదు. వాళ్లను ఎమోషనల్ జర్నీలోకి తీసుకెళ్లారు. అంతేకాదు ప్రతీ షోలో ఒక హ్యూమన్ యాంగిల్ స్టోరీని సైతం ప్రసారం చేశారు. తనపై వచ్చిన రూమర్లు, గాసిప్స్ కు కూడా బాలయ్య ఇదే వేదిక నుంచి క్లారిటీ ఇచ్చారు. హీరో రవితేజాతో గొడవ, ఎన్టీఆర్ కు వెన్నుపోటు వంటి వాటిపై స్పష్టతనిచ్చారు. దశాబ్దాల కిందట నాటి గొడవ ఇప్పటికీ వైరల్ అవుతుండగా..దానిపై నేరుగా రవితేజాతోనే చెప్పించారు. ఎన్నో సంచలనాలు నమోదుచేసుకున్న అన్ స్టాపబుల్ సీజన్ వన్ మోహన్ బాబుతో ప్రారంభమై ప్రిన్స్ మహేష్ బాబుతో ముగిసింది. అటు ఆహా సంస్థతో పాటు బాలక్రిష్ణను ఒక రేంజ్ లోకి తీసుకెళ్లింది.
అయితే ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం కానుంది. విజయదశమి నుంచి ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతకంటే ముందే స్మాల్ స్క్రీన్ చరిత్రలో మొదటి సారి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించాలని ఆహా సంస్థ, ఇటు అన్ స్టాపబుల్ టీమ్ నిర్ణయించాయి. ఇందుకు విజయవాడను వేదికగా నిర్ణయించి ఏర్పాట్లు చేస్తున్నారు. దసరాకు ముందే ఈవెంట్ ను నిర్వహించి.. సీజన్ టుకు సంబంధించి ట్రైలర్ విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి ట్రైలర్ సిద్ధమైందని… సారధి, అన్నపూర్ణ స్టూడియోల్లో భారీ సెట్లు రూపొందించి మరీ బాలయ్యపై ట్రైలర్ షూట్ చేశారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. సీజన్ వన్ కు డైరక్షన్ బాధ్యతలు వహించిన ప్రశాంత్ వర్మే.. రెండో సీజన్ కు పనిచేయనున్నారు. స్మాల్ స్క్రీన్ కు ఇదివరకూ ఎన్నడూ లేని విధంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన నూతన ఒరవడి సృష్టించాలని అన్ స్టాపబుల్ టీమ్ భావిస్తోంది.

రెండో సీజన్ కు భారీగానే సన్నాహాలు చేస్తున్నారు. ఆసక్తికరమైన సెలబ్రెటీల జాబితా బయటకు వస్తోంది. ప్రధానంగా పవన్ త్రివిక్రమ్, చిరంజీవి, చంద్రబాబు, లోకేష్ ల పేర్లు వినిపిస్తున్నాయి. సీజన్ 1కు మించి సీజన్ 2లో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనాలని ఆహా సంస్థ, అన్ స్టాపబుల్ టీమ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. ఇందుకు విజయవాడలోని ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నాయి.
[…] Also Read: Balakrishna Meeting in Vijayawada: విజయవాడలో బాలక్రిష్ణ భా… […]