Munugode Election 2022 తెలంగాణలో అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ‘మునుగోడు’ ఉప ఎన్నికలకు ఈసీ పచ్చజెండా ఊపింది. పార్టీల బలాబలాలు తేలే సమయం ఆసన్నమైంది. అందరూ అనుకున్నట్టు దీన్ని గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటు నిర్వహించడం లేదు. నెలరోజుల్లోనే ఎన్నికలు ముగియనున్నాయి. గుజరాత్ అసెంబ్లీకి ముందే మధ్యలో మిగిలిన ఈ కొన్ని అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధమైంది.

మునుగోడు తో పాటు మరో ఐదు రాష్ట్రాల్లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఉప ఎన్నికలు. తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఒడిశా ల్లోని ఒక్కో నియోజకవర్గానికి, బీహార్ లో రెండు నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలు
మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మరో నెలరోజుల్లోనే ఈ ఎన్నిక నిర్వహణకు తేదీ ప్రకటించడం విశేషం. దీంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
-నవంబర్ 3న ఉప ఎన్నికల పోలింగ్
-నవంబర్ 6న ఓట్ల లెక్కింపు.
-ఈనెల 7న విడుదల కానున్న ఎన్నికల నోటిఫికేషన్-
ఈనెల 14 వరకు నామినేషన్ల దాఖలకు గడువు.
మునుగోడులో గెలిచి తీరాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితోపాటు కేంద్రంలోని బీజేపీ పెద్దలు పట్టుదలగా ఉన్నారు. ఇప్పటికే అమిత్ షా, జేపీ నడ్డా సహా చాలా మంది కేంద్రమంత్రులు దండయాత్ర మొదలుపెట్టారు. కానీ కోమటిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఆ పార్టీకి మైనస్ గా మారింది.
ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించింది. అక్కడ ప్రచారమూ మొదలుపెట్టింది. కోమటిరెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఆయనను ఓడించడమే ధ్యేయంగా పెట్టుకుంది.
ఇక అధికార టీఆర్ఎస్ పార్టీలో ఆశావహులు క్యూ కడుతున్నారు. కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తాడన్నది ఉత్కంఠ రేపుతోంది. ఈ సీటు ఖచ్చితంగా అయితే టీఆర్ఎస్ లేదా బీజేపీకి వెళ్లే ఛాన్స్ ఉంది. కాంగ్రెస్ కూడా తీసిపారేయడానికి లేదు. సో ఈ సంకుల సమరంలో గెలిచేది ఎవరన్నది ఆసక్తి రేపుతోంది.
[…] Also Read: Munugode Election 2022 బిగ్ బ్రేకింగ్: మునుగోడు ఉప ఎ… […]