Double ISmart: ఇలాంటి పాత్రని రాసినందుకు పూరీ జగన్నాథ్ ని జైలుకు పంపాల్సిందే..తెలుగు సినిమా పరువుని తీసేసారు!

ఒకప్పుడు పూరీ జగన్నాథ్ రాజమౌళి కంటే పెద్ద దర్శకుడు. ఆయన సినిమా వస్తుంది అంటే కళ్ళు మూసుకొని థియేటర్స్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేవారు ఆడియన్స్. పోకిరి లాంటి సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన గొప్ప చరిత్ర ఆయనది.

Written By: Vicky, Updated On : August 17, 2024 1:26 pm

Double ISmart(3)

Follow us on

Double ISmart: తెలుగు సినిమా ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలతో పోటీ పడే స్థాయికి చేరుకుంది. రాజమౌళి మన తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాడు, ఆస్కార్ అవార్డు ని కూడా గెలుచుకునేలా చేసి మన సత్తా ఏంటో ప్రపంచం మొత్తానికి చూపించాడు. రాజమౌళి ఇచ్చిన ఈ స్పూర్తితో ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ కొత్త ఆలోచనలతో మన ముందుకు వస్తున్నారు. ఆయన పెంచిన మార్కెట్ ని ఉపయోగించుకొని సందీప్ వంగ, ప్రశాంత్ నీల్, నాగ అశ్విన్ వంటి వారు సంచలనాలు సృష్టించి మన తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని ఎవ్వరూ అందుకోలేని రేంజ్ కి తీసుకెళ్లారు. అయితే ఆ స్థాయికి వెళ్లిన తెలుగు సినిమాని నవ్వులపాలు చేసేందుకు పూరీ జగన్నాథ్ లాంటి దర్శకులు కంకణం కట్టుకున్నారు అనేది రీసెంట్ గా విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా చూస్తే తెలుస్తుంది.

ఒకప్పుడు పూరీ జగన్నాథ్ రాజమౌళి కంటే పెద్ద దర్శకుడు. ఆయన సినిమా వస్తుంది అంటే కళ్ళు మూసుకొని థియేటర్స్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేవారు ఆడియన్స్. పోకిరి లాంటి సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన గొప్ప చరిత్ర ఆయనది. అలాంటి పూరీ జగన్నాథ్ లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి ఘోరమైన సినిమాలు తీస్తాడని బహుశా ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. హీరోయిన్ ఛార్మీ తో ఆయన ఎప్పుడైతే చేతులు కలిపాడో అప్పటి నుండి సర్వనాశనం అయిపోయాడు. రీసెంట్ గా విడుదలైన డబుల్ ఇస్మార్ట్ సినిమాని చూస్తే పూరీ జగన్నాథ్ అభిమానులు వెక్కిళ్లు పెట్టి ఏడవడం ఖాయం. ముఖ్యంగా ఆయన రాసుకున్న కమెడియన్ అలీ కామెడీ ట్రాక్ ని చూసిన ప్రతీ ప్రేక్షకుడికి పూరీని చంపేయాలి అనేంత కోపం వస్తాది. ఇందులో అలీ ఒక అడవి మనిషి అవతారంలో కనిపిస్తాడు. కోతి లాగా కనిపించే అతనికి కేవలం వేటాటడం, అమ్మాయిలతో శృంగారం చెయ్యడం, కేవలం ఈ రెండు మాత్రమే తెలుసు. ఈ సినిమాలో ఒక ప్రెస్ మీట్ సన్నివేశం ఉంటుంది. ఆ ప్రెస్ మీట్ లో విచిత్రంగా కనిపించే అలీ ని పోలీసులు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేయించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అలీ అక్కడికి వచ్చిన ఒక లేడీ యాంకర్ ని చూసి, కామంతో ఆమె మీదకి వెళ్ళిపోతాడు.

ఆమెని ముట్టుకోరాని చోట్ల ముట్టుకుంటూ, చెయ్యి పట్టుకొని ఎదో ఆట వస్తువుని తీసుకెళ్లినట్టు ఆ అమ్మాయిని తీసుకెళ్తాడు. ఇంతకంటే దారుణమైన సన్నివేశం ఎక్కడైనా ఉంటుందా చెప్పండి . అసలే సమాజంలో రోజు రోజుకి హత్యాచారాలు పెరిగిపోతూ ఉన్నాయి. 60 ఏళ్ళ ముసలోడు 5 ఏళ్ళ బాలికని బలవంతం చెయ్యడం వంటి ఘటనలు ఈమధ్య కాలం లోనే మనం ఎన్నో చూసాము. అలాంటి ఈ కాలం లో ఇలాంటి పాత్రలు రాయడం క్షమించరాని నేరం. ఈ సినిమాని ఇంకా మహిళా సంఘాలు చూసినట్టు లేదు. ఒకవేళ చూస్తే మాత్రం పూరీ జగన్నాథ్ ని జైలుకు పంపే వరకు నిద్రపోరని అంటున్నారు నెటిజెన్స్.