https://oktelugu.com/

Jani Master: జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరు చేసిన కోర్టు…కానీ ఆ విషయాలకు దూరం గా ఉండాల్సిందేనా..?

సినిమా ఇండస్ట్రీలో 'నేషనల్ అవార్డు' ని అందుకోవడం అనేది ఒక కల... ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని భావించే రోజు కూడా అదే కావడం విశేషం... మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళ ఎంటైర్ కెరీర్ లో ఒక్కసారైనా నేషనల్ అవార్డు అందుకోవాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 4, 2024 / 12:23 PM IST

    Jani Master(3)

    Follow us on

    Jani Master: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రావడం ఎంత ముఖ్యమో ఆ వచ్చిన గుర్తింపును కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యము… చాలామందికి టాలెంట్ ఉన్నా కూడా ఇక్కడ అవకాశాలు ఎక్కువగా రావు.. వచ్చిన వాళ్ళు వాటిని ప్రూవ్ చేసుకోవడంలో చాలావరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక అవకాశం వచ్చి సక్సెస్ ఫుల్ గా నిలిచిన వారు సైతం కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల వాళ్ల సినిమా కెరియర్ మొత్తాన్ని కోల్పోవాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. మరి ఇలాంటి పొరపాట్లు ఏమి చేయకుండా ముందుకు సాగితేనే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా సాగే అవకాశాలైతే ఉంటాయి అనేది మాత్రం వాస్తవం… ఇక ఇలాంటి నేపథ్యంలోనే గత కొన్ని రోజుల క్రితం జానీ మాస్టర్ తన అసిస్టెంట్ పైన లైంగిక దాడి చేస్తున్నాడనే ఆరోపణలతో ఒక కేసు అయితే నమోదైంది.ఇక ప్రస్తుతం ఫోక్సో కేసు మీద జైల్లో ఉన్నాడు. మరి ఆయనకి రీసెంట్ గా నేషనల్ అవార్డు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ధనుష్ హీరోగా, నిత్యమీనన్ హీరోయిన్ గా వచ్చిన ‘తిరు చట్రంబలం’ అనే సినిమాలో జానీ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ కి ‘నేషనల్ అవార్డు’ వరించింది. ఇక ఈ సందర్భంలో ఆయన జైల్లో ఉన్నాడు కాబట్టి ఈ నెల 8వ తేదీన జాతీయ అవార్డు ను ప్రధానం చేయబోతున్నారు. ఇక దాంతో ఆయన ఆ ఈవెంట్ కి హాజరు అవ్వడానికి 3 రోజులపాటు బెయిల్ మంజూరు చేయమని హైకోర్టు ను ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. దానికి కోర్టు కూడా అంగీకరించి ఆయనకు కొన్ని షరతుల మీద మూడు రోజుల పాటు బెయిల్ అయితే ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    మరి అందులో భాగంగానే జానీ మాస్టర్ ఈ వివాదానికి సంబంధించిన మాటలను ఎవరితో మాట్లాడకూడదని, న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వకూడదని హైకోర్టు కొన్ని షరతులనైతే పెట్టింది. ఇక మొత్తానికైతే అక్టోబర్ 10వ తేదీన ఆయన మళ్ళీ హైకోర్టు కి వచ్చి లొంగిపోవాలని చెప్పడం విశేషం. మరి మొత్తానికైతే ఆయన జాతీయ అవార్డు వచ్చిందని ఆనందపడాలా లేదా అది ప్రధానం చేసే సమయంలో జైల్లో ఉన్నందుకు బాధపడాలా అనేది తెలియని ఒక సందిగ్ధ పరిస్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది…

    ఇక మొత్తానికైతే జానీ మాస్టర్ తను అవార్డు అందుకోవడానికి ఢిల్లీ వెళ్ళబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇది తెలుసుకున్న కొంతమంది మాత్రం ఇలాంటి సిచువేషన్ లో జాతీయ అవార్డు తీసుకోవడానికి అక్కడికి వెళ్లడం అవసరమా అక్కడికి వెళ్తే తన తోటి నేషనల్ అవార్డు గెలుచుకున్న సెలబ్రిటీలు అతన్ని చూసి నవ్వుకుంటారు కదా..జరిగిన విషయానికి ఆయన వాళ్ళకి ఎలాంటి ఎక్స్ప్లనేషన్ ఇస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక మొత్తానికైతే ఒకే టైంలో రెండు రకాల ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ జానీ మాస్టర్ ఇప్పుడు అవార్డు అందుకోడానికి ముందుకెళ్లాల్సిన అవసరమైతే ఉంది.

    ఇక ఒక ముద్దాయికి అవార్డుని ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇది సగటు ప్రేక్షకుడి మీద నెగటివ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేసే అవకాశం ఉందా అంటూ కొంతమంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. జానీ మాస్టర్ తప్పు చేశాడు అని ఇంకా రుజువు అవ్వలేదు. కాబట్టి దాని మీద పెద్దగా ఇంపాక్ట్ పడే అవకాశం ఉండకపోవచ్చు అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేయడం విశేషం…