https://oktelugu.com/

Junior NTR: కొరటాల శివ మీద ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన జూనియర్ ఎన్టీయార్…

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు పాన్ ఇండియాలో మంచి సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక మన హీరోలు సాధించిన విజయాలు మరే హీరోలు సాధించడం లేదు.

Written By:
  • Gopi
  • , Updated On : October 4, 2024 / 12:21 PM IST

    Junior NTR(4)

    Follow us on

    Junior NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నందమూరి ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న మిగతా హీరోలందరికి పోటీని ఇస్తు జూనియర్ ఎన్టీయార్ తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేసిన దేవర సినిమా సూపర్ సక్సెస్ టాక్ ని సంపాదించుకొని ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సందర్భంగా సినిమా యూనిట్ సక్సెస్ మీట్ ను కూడా జరిపారు. ఇక అందులో భాగం గానే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ కొరటాల శివ కి తనకి బృందావనం సినిమా నుంచి పరిచయం ఉందని అప్పట్నుంచి వాళ్ళ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అది ఇప్పటివరకు అలాగే కొనసాగుతూ వస్తున్నాయని చెప్పాడు. ఇక ప్రస్తుతం కొరటాల శివ తన ఫ్యామిలీ మెంబర్ అయ్యాడని ఎన్టీయార్ చెప్పడం విశేషం…

    అలాగే దేవర 2 సినిమా కోసం తను ఆసక్తి ఎదురు చూస్తున్నట్టుగా కూడా తెలియజేయడం విశేషం. ఇక మొత్తానికైతే ‘దేవర 2’ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని ఎన్టీఆర్ చెప్పడం విశేషం… ఇక ఇదిలా ఉంటే ‘ఎన్టీయార్ ఆర్ట్స్’ బ్యానర్ మీద కూడా ఎన్టీఆర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా మారి ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్ ను స్థాపించిన విషయం మనకు తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన పూర్తి వ్యవహారాలను హరికృష్ణ అనే వ్యక్తి చూసుకుంటాడు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కూడా తమ బ్యానర్ బాగా చూసుకుంటున్న హరికృష్ణ తమకు వెన్నుముక లాంటివాడని ఆయన లేకపోతే ఈ బ్యానర్ ఇలా ఉండేది కాదని ఆయన గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడడం విశేషం…

    ఇక మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా మీదికి తన పూర్తి ఫోకస్ ను షిఫ్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమాలతో ఎన్టీయార్ తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాడా?లేదా అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది.

    అయితే ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా కూడా జూనియర్ ఎన్టీఆర్ అవతరించిన సందర్భంలో ఆయన తన తదుపరి సినిమాలతో భారీ సక్సెస్ ని సాధించాలని కూడా టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక దేవర సినిమా ఇప్పటికే 500 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టి ఇండస్ట్రీలో పలు రికార్డులను సృష్టించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది…