Happy Birthday Rishabh Pant: అతడు చూడటానికి ఐదున్నర అడుగులు ఉంటాడు.. కానీ మైదానంలోకి దిగితే చిచ్చరపిడుగు లాగా మారతాడు. బౌలర్ ఎవరనేది చూడడు. ఇలాంటి బంతినైనా బాదడమే పనిగా పెట్టుకుంటాడు. ఫోర్, సిక్స్ లు ఇలా కొట్టుకుంటూ వెళ్తాడు. చివరికి చేయాల్సిన నష్టం చేసి వెళ్తాడు. పురాణ కాలంలో లంకను హనుమంతుడు ఎలా దహనం చేశాడో.. అదే తీరుగా ప్రత్యర్థి జట్టును కోలుకోలేని దెబ్బతీయడంలో అతడు బ్యాట్ హస్తుడు. అందుకే సమకాలీన భారత క్రికెట్లో అతడిని ధోని వారసుడు అని చెబుతున్నారు.
టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం తన 27వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అతడికి సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రిషబ్ పంత్ 1997 అక్టోబర్ 4న జన్మించాడు. తనకు 12 సంవత్సరాల వయసు వచ్చిన నాటి నుంచి అతడు క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు. తన తల్లితో న్యూ ఢిల్లీ వచ్చి క్రికెట్ కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు. ప్రారంభంలో అనేక ఇబ్బందులు పడ్డ తర్వాత.. చివరికి రంజి ట్రోఫీలో దేశవాళీ క్రికెట్ ఆట మొదలుపెట్టాడు. 2015 -16 సంవత్సరంలో విజయ్ హజారే ట్రోఫీ సీజన్లో లిస్ట్ – ఏ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు..2016-17 రంజి ట్రోఫీలో మహారాష్ట్ర పై 308 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో త్రిబుల్ సెంచరీ చేసిన మూడవ అతి పిన్నవస్కుడైన బ్యాటర్ గా అవతరించాడు. 2016 లో అండర్ 19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అనంతరం ఐపీఎల్లో ఢిల్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. వేలంలో 1.9 కోట్ల ధరను దక్కించుకున్నాడు. 2017 ఐపిఎల్ సీజన్లో అతడు 14 ఇన్నింగ్స్ లలో 366 రన్స్ చేశాడు. 2017లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మూడవ టి20 లో అతడు మైదానంలోకి ప్రవేశించాడు. తొలి మ్యాచ్లో మూడు బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి.. నాటౌట్ గా నిలిచాడు. పంత్ ధోని లాగే కీపింగ్ చేస్తుంటాడు.. ఇప్పటికే ధోని రికార్డులలో కొన్ని సమం చేశాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియా తో బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇటీవల పంత్ బంగ్లాదేశ్ జట్టుపై సెంచరీ చేశాడు.
2022లో పంత్ ఘోరమైన రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఆ సమయంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చాడు. దాదాపు సంవత్సరం పాటు మంచానికే పరిమితమయ్యాడు. తీవ్ర గాయాలు కావడంతో కొద్ది నెలలపాటు అతడు బ్రష్ కూడా చేసుకోలేకపోయాడు. అలాంటి స్థితిలో తనను తాను పునరావిష్కరించుకున్నాడు. ఇటీవలి ఐపిఎల్ సీజన్లో ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. పర్వాలేదని స్థాయిలో ఢిల్లీ జట్టును నడిపించాడు.. ఆ తర్వాత టి20 వరల్డ్ కప్ లో తనదైన ప్రదర్శన చేశాడు. టీమిండియా గెలుపులో తన పాత్ర పోషించాడు . ఇటీవల బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో.. మైదానంలో నవ్వులు పూయించాడు .. బంగ్లా జట్టు ఫీల్డింగ్ ను సెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీగా నిలిచాడు. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన 632 రోజుల తర్వాత టెస్ట్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అంతకుముందు దులీప్ ట్రోఫీలో ఇండియా – బీ జట్టు తరఫున ఆడాడు. 47 బంతుల్లో 61 రన్స్ చేసి ఆకట్టుకున్నాడు. మైదానంలో చురుగ్గా ఉంటూ ధోని స్థానాన్ని భర్తీ చేయడంలో పంత్ తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. శుక్రవారం తన 27వ జన్మదినం జరుపుకుంటున్న సందర్భంగా రిషబ్ పంత్ కు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇది క్రమంలో రిషబ్ పంత్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీ గా ఆవిర్భవించాడు.