https://oktelugu.com/

Court : ‘కోర్ట్’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇంత గ్రాస్ ఎవ్వరూ ఊహించి ఉండరు!

Court : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన 'కోర్ట్'(Court Movie) చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Written By: , Updated On : March 19, 2025 / 05:11 PM IST
Court

Court

Follow us on

Court : నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నిర్మాతగా వ్యవహరించిన ‘కోర్ట్'(Court Movie) చిత్రం ఇటీవలే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఒక కోర్ట్ డ్రామా ని సరైన స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తే, హీరో ఎవరు ఏమిటి అనేది జనాలు చూడరు, బ్రహ్మరథం పట్టేస్తారు అనడానికి మరో నిదర్శనం ఈ కోర్టు చిత్రం. ఓపెనింగ్స్ విషయం లో హీరో నాని బ్రాండ్ ఇమేజ్ పని చేసింది, ఆ బ్రాండ్ ఇమేజ్ కి తోడుగా ‘ప్రేమలో’ సాంగ్ సూపర్ హిట్ అవ్వడం, యూత్ ఆడియన్స్ కి ఈ చిత్రాన్ని బాగా దగ్గరయ్యేలా చేసింది. ఇక విడుదల తర్వాత మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ మామూలు రేంజ్ లో రాలేదు. దీంతో ఆడియన్స్ రెండవ రోజు నుండి థియేటర్స్ కి క్యూలు కట్టేసారు. వీకెండ్ తర్వాత స్లో అవుతుందని అందరూ అనుకున్నారు.

Also Read : కోర్ట్’ చిత్రానికి శివాజీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఇంతేనా..?

కానీ వర్కింగ్ డేస్ లో కూడా ఈ చిత్రం స్టడీ కలెక్షన్స్ ని రాబడుతూ ముందుకెళ్లడం ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఉదాహరణకు ఈ చిత్రానికి నాల్గవ రోజున కోటి 36 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ఐదవ రోజు కోటి 35 లక్షల రూపాయిలు వచ్చాయట. అంటే ముందు రోజు తో పోలిస్తే 99 శాతం వసూళ్లను హోల్డ్ లో ఉంచగలిగింది. సాయంత్రం షోస్ నుండి హౌస్ ఫుల్స్ భారీగా నమోదు అవ్వడం వల్లే ఈ చిత్రానికి ఇంతటి స్టడీ కలెక్షన్స్ వస్తున్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి రావడం మొదలు పెట్టినట్టు ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఒక సినిమాకు కదలడం మొదలు పెడితే, ఆ సినిమా థియేట్రికల్ రన్ ఎక్కడ మొదలై, ఎక్కడ ఆగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.

ఊపు చూస్తుంటే ఈ వీకెండ్ లో కూడా ఈ చిత్రం దంచి కొట్టేసేలా ఉంది. 5 రోజుల్లో 16 కోట్ల 37 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి 32 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే, ఈ వీకెండ్ కి 55 కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం ఒక్క నైజాం ప్రాంతంలోనే ఈ సినిమాకు 5 రోజుల్లో 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో కచ్చితంగా పది కోట్ల షేర్ మార్కుని అందుకునేలా ఉంది. ఇక ఓవర్సీస్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 8 లక్షల డాలర్స్ వచ్చాయి. ఇండియన్ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే 4 కోట్ల రూపాయిల షేర్ అన్నమాట. ఈ వీకెండ్ తో నార్త్ అమెరికా లో ఈ సినిమా 1 మిలియన్ గ్రాస్ మార్కుని కూడా అందుకోబోతుంది. ఫుల్ రన్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి.

Also Read : కోర్ట్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఓవర్సీస్ లో కాసుల కనక వర్షం!