Court Movie : సీనియర్ హీరో శివాజీ(Shivaji) సినిమాల ద్వారా సంపాదించిన క్రేజ్ కంటే, ‘బిగ్ బాస్'(Bigg Boss 7 Telugu) షో ద్వారా సంపాదించిన క్రేజ్ ఎక్కువ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ పలు సూపర్ హిట్ సినిమాల్లో హీరో గా నటించాడు, క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించాడు కానీ, గొప్పగా గుర్తు పెట్టుకోవాల్సిన పాత్రలు అప్పట్లో లేవు, కానీ రీసెంట్ గా విడుదలైన ‘కోర్ట్'(Court Movie) చిత్రంలో ఆయన పోషించిన మంగపతి క్యారక్టర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచిపోయే క్యారెక్టర్స్ లో ఒకటిగా నిల్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమా నేడు థియేటర్స్ లో అంత అద్భుతంగా రన్ అవుతుందంటే అందుకు శివాజీ పోషించిన క్యారక్టర్ కూడా ఒక కారణం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ మంగపతి క్యారక్టర్ ఆయనకు దక్కింది అంటే అందుకు కారణం ‘బిగ్ బాస్’ ద్వారా తెచ్చుకున్న క్రేజ్ అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Also Read : ‘కోర్ట్’ 3 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఓవర్సీస్ లో కాసుల కనక వర్షం!
ఈ షో ద్వారా శివాజీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల అభిమానాన్ని పొందాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ లో ఆయన షో ద్వారా సంపాదించుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. దానికి తోడు బిగ్ బాస్ నుండి శివాజీ బయటకు రాగానే ఈటీవీ విన్ యాప్ లో ’90s’ అనే వెబ్ సిరీస్ విడుదలైంది. ఈ వెబ్ సిరీస్ శివాజీ బిగ్ బాస్ లోకి వెళ్లకముందే షూట్ చేసారు. కానీ మేకర్స్ ఆయన బయటకు వచ్చాక మంచి క్రేజ్ తో వస్తాడు కాబట్టి, ఆ క్రేజ్ ని క్యాష్ చేసుకుంటూ ఈ వెబ్ సిరీస్ ని విడుదల చేసింది. ఈ వెబ్ సిరీస్ సంచలన విజయం సాధించింది. ఇప్పటికీ ఈటీవీ విన్ యాప్ లో ఈ వెబ్ సిరీస్ ట్రెండ్ అవుతూనే ఉంది. ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ తర్వాత ఇప్పుడు కోర్ట్ లాంటి మరో బ్లాక్ బస్టర్ దొరికింది.
ఈ సినిమాతో టాలీవుడ్ కి కొత్త విలన్ దొరికేశాడు అంటూ ప్రతీ ఒక్కరు కామెంట్ చేసారు. కేవలం పెర్ఫార్మన్స్ తోనే కాదు, స్క్రీన్ ప్రెజెన్స్ లో కూడా శివాజీ వెండితెర పై వెలిగిపోతున్నాడు. అందుకే ఇప్పుడు ఆయనకు ఆఫర్స్ క్యూలు కడుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ‘కోర్ట్’ సినిమాకు శివాజీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ చిత్ర నిర్మాత నాని(Natural Star Nani) ఆయనకు కేవలం 50 లక్షల రూపాయిలు మాత్రమే ఇచ్చాడట. ఇది చాలా తక్కువ అనే చెప్పాలి. కానీ ఈ ఒక్క సినిమాతో శివాజీ ఇక నుండి రెండు కోట్ల రూపాయిలు డిమాండ్ చేసే రేంజ్ ఆర్టిస్టుగా ఎదిగిపోయాడు. చూడాలి మరి భవిష్యత్తులో ఈయన మరో జగపతి బాబు రేంజ్ విలన్ అవుతాడా లేదా అనేది. ఒకవేళ అయితే మాత్రం శివాజీ కి మహర్దశ పెట్టినట్టే.
Also Read : ‘కోర్ట్’ 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఈ రేంజ్ లాభాలను నిర్మాత గా నాని కలలో కూడా ఊహించి ఉండదు!