Rajinikanth Coolie: తమిళ్ సూపర్ స్టార్ గా రజినీకాంత్ చాలా సంవత్సరాల పాటుగా ఒక వెలుగు వెలుగుతున్నాడు. ఇక ఇప్పటికి కూడా ఆయనను బీట్ చేసే హీరో తమిళ్ ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. గత సంవత్సరంలో ఆయన తీసిన జైలర్ సినిమా పాన్ ఇండియాలో 400 కోట్లకు పైన కలెక్షన్లు రాబట్టి రజనీకాంత్ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన ఇప్పుడు లోకేష్ కనకరాజు డైరెక్షన్ లో ‘కూలీ ‘ అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఇంతకుముందు ఆయన చేసిన జైలర్ సినిమాను మించి ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వబోతుంది అంటూ ఇప్పటికే తమిళ్ ఇండస్ట్రీలో ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది. ఇక లోకేష్ కనకరాజ్ కూడా తన గత చిత్రమైన ‘ లియో ‘ సినిమాతో కొద్ది వరకు వెనుకబడ్డాడు. కాబట్టి ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ఏంటో భారీ ఎత్తున ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అయితే ఉన్నాడు. ఇంకా ఈ సినిమా కూడా లోకేష్ యూనివర్స్ లోనే తెరకెక్కుతుందా లేదా అనే విషయాలపైన సరైన క్లారిటీ అయితే లేదు. కానీ ఈ సినిమాతో రజినీకాంత్ మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోబోతున్నాడు అనే వార్తలైతే వినిపిస్తున్నాయి.
ఇక దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ ని కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. దానికి పాన్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ అయితే వచ్చింది. ఇక లోకేష్ కనకరాజ్ విక్రమ్ మూవీ లో కమలహాసన్ ను ఏ రేంజ్ లో అయితే చూపించాడో దానికి మించి ఈ సినిమాలో రజనీకాంత్ ను చూపించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో మన తెలుగు స్టార్ హీరో అయిన విక్టరీ వెంకటేష్ కూడా ఒక గెస్ట్ రోల్ ని పోషించబోతున్నట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇంకా ఇప్పటికే వెంకటేష్ తెలుగులో ఉన్న చాలా మంది హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేశాడు.
అలాగే కొన్ని గెస్ట్ రోల్స్ లో కూడా నటించి మెప్పించాడు. ఇక లోకేష్ సినిమాలో గెస్ట్ రోల్స్ అంటే అవి బాగా ఎలివేట్ అవుతూ ఉంటాయి. విక్రమ్ సినిమాలో చివరలో వచ్చిన సూర్య రోలెక్స్ క్యారెక్టర్ లో చేసి ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నాడో మనకు తెలిసిందే. ఇక ఇప్పుడు వెంకటేష్ కూడా అలాంటి గుర్తింపు సంపాదించుకుంటాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది…