Anasuya Bharadwaj: ఒకప్పటి జబర్దస్త్ అనసూయ భరద్వాజ్ సిల్వర్ స్క్రీన్ పై సక్సెస్ఫుల్ గా రాణిస్తుంది. టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా ఆమె ఉన్నారు. అనసూయ హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చింది. మొదట్లో ఆమె జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. నాగ సినిమాలో కాలేజ్ స్టూడెంట్స్ లో ఒకరిగా ఆమె ఫ్రేమ్ లో జస్ట్ కనిపిస్తారు. అనంతరం న్యూస్ రీడర్ జాబ్ చేసింది. గ్లామర్ ఫీల్డ్ లో రాణించడమే లక్ష్యంగా పెట్టుకున్న అనసూయకు జబర్దస్త్ రూపంలో బంపర్ ఛాన్స్ దక్కింది. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమైంది.
Also Read: సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ కోసం ఆ స్టోరీ ని రెడీ చేశారా..? కథ మామూలుగా లేదుగా…
ఈ కామెడీ షోలో స్కిన్ షోకి తెరలేపిన అనసూయ అనతి కాలంలో పాప్యులర్ అయ్యింది. ఆమె డ్రెస్సింగ్ పై వచ్చిన విమర్శలు, వివాదాలు ఆమెకు ప్లస్ అయ్యాయి. అనసూయ అంటే గ్లామరస్ తెలుగు యాంకర్ అనే ఇమేజ్ సొంతం చేసుకుంది. యాంకర్ వచ్చిన ఫేమ్ సినిమా ఆఫర్స్ తెచ్చిపెట్టింది. క్షణం, రంగస్థలం వంటి చిత్రాలు ఆమెకు బ్రేక్ ఇచ్చాయి. లీడ్ రోల్స్ చేసే ఛాన్స్ కూడా అనసూయకు వచ్చింది.
అనసూయ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధం. విమానం మూవీలో వేశ్యగా నటించి సంచలనానికి తెరలేపింది. సాధారణంగా ఇలాంటి పాత్రలు చేయడానికి హీరోయిన్స్ ముందుకు రారు. కానీ అనసూయ ఛాలెంజింగ్ రోల్ చేసి తానేంటో నిరూపించుకుంది. పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో పూర్తి నెగిటివ్ రోల్ చేసి మెప్పించింది అనసూయ. స్టార్ హీరోల చిత్రాల్లో క్రేజీ రోల్స్ చేస్తున్న అనసూయ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే… గతంలో కాల్షీట్ కి లక్ష రూపాయలు తీసుకునేవారట.
పుష్ప 2 చిత్రానికి అనసూయ రూ. 1.5 నుండి 2 లక్షలు తీసుకుందని సమాచారం. అయితే ఓ యంగ్ హీరో సినిమాకు అత్యధికంగా అనసూయ రూ.3 నుండి 4 లక్షలు రోజుకు తీసుకుంటుందట. పెదకాపు మూవీతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ రెండో చిత్రంగా నాగ బంధం చేస్తున్నాడు. ఈ మూవీలో అనసూయ ఓ కీలక రోల్ చేస్తుందట. నాగబంధం చిత్రానికి అనసూయ కెరీర్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్.
ఇక బుల్లితెర ప్రేక్షకుల అనసూయను బాగా మిస్ అవుతున్నారు. ఆ మధ్య కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ షోలో జడ్జిగా అలరించింది. మరలా ఇంకో షో అనసూయ ఒప్పుకోలేదు.
Also Read: రాజమౌళి మహేష్ బాబు ను ఆ రేంజ్ లో ఎలివేట్ చేయడానికి కారణం ఏంటి..? ఆయన మామూలోడు కాదురా బాబు…