Cooli vs Thug Life Collections: రీసెంట్ గా విడుదలైన కమల్ హాసన్(Kamal Haasan) ‘థగ్ లైఫ్'(Thug Life) మూవీ ఫలితం ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘విక్రమ్’ చిత్రం తర్వాత కమల్ హాసన్ ‘ఉత్తమ విలన్’ లాంటి ఘోరమైన డిజాస్టర్స్ ఎంత ప్లాన్ చేసుకున్నా తీయలేడు అని అంతా అనుకున్నారు, కానీ ‘థగ్ లైఫ్’ చిత్రం దానికంటే ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అటు తమిళం లో కానీ,ఇటు తెలుగు లో కానీ థియేటర్స్ నుండి కనీసం షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోతుంది ఈ చిత్రం. అనేక ప్రాంతాల్లో థియేటర్స్ ని మూసేసుకున్నారు. మొదటి వారం లో 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం ఫుల్ రన్ వంద కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేయడం కష్టతరమైన పని గా మారింది అంటేనే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమా ఏ రేంజ్ డిజాస్టర్ అనేది.
అలాంటి డిజాస్టర్ చిత్రం సౌత్ ఇండియా లో మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ గా పిలవబడే రజనీకాంత్ ‘కూలీ’ రికార్డు ని బద్దలు కొట్టిందంటే ఎవరైనా నమ్ముతారా?, కానీ నమ్మాలి, ఎందుకంటే అది నిజం కాబట్టి. రజనీకాంత్(Super Star Rajinikanth) ‘కూలీ'(Coolie Movie) చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ దాదాపుగా 120 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మీద ఉన్న క్రేజ్ తో పోల్చి చూస్తే చాలా తక్కువ రేట్ కి తీసుకున్నారని అనిపిస్తుంది కదూ?, అలా తీసుకోవడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) గత చిత్రం ‘లియో’ ని భారీ రేట్ కి కొనుగోలు చేశారు. కానీ ఆ రేట్ కి తగ్గ వసూళ్లను ఈ చిత్రం రాబట్టలేకపోయింది. అందుకే తక్కువ రేట్ కి కొనుగోలు చేశారు. మరో పక్క కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ చిత్రాన్ని ఇదే నెట్ ఫ్లిక్స్(Netflix) సంస్థ 159 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది.
Also Read: Coolie Movie : ‘కూలీ’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని భారీ రేట్ కి కొనుగోలు చేసిన నాగార్జున!
ఇంత రేట్ కి అమ్ముడుపోవడానికి ప్రధాన కారణం మణిరత్నం(Maniratnam). ఆయన సినిమాలు థియేటర్ లో ఆడినా, ఆడకపోయినా బుల్లితెర ప్రేక్షకులు మాత్రం కచ్చితంగా ఆదరిస్తారు. ఇప్పటి వరకు ఓటీటీ లో విడుదలైన మణిరత్నం సినిమాలు నెలల తరబడి ట్రెండ్ అయ్యాయి. పైగా ఇంత పెద్ద స్పాన్ లో తీసిన చిత్రం కావడం, దానికి తోడు కమల్ హాసన్, శింబు కాంబినేషన్ ఉండడం తో టాక్ తో సంబంధం లేకుండా కనీసం ఒక్కసారైనా ఈ సినిమాని చూస్తారు అనే ఉద్దేశ్యంతో 159 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. థియేటర్స్ లో విడుదలైన 8 వారాల తర్వాత నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేయాలనీ ముందుగా ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడం తో కేవలం నాలుగు వారాల్లోనే నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.