Maruti Brezza : భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న సబ్-కాంపాక్ట్ SUVలలో మారుతి బ్రెజా ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో ఉంది. దీని పాపులారిటీ ఎంత పెరిగిందంటే జూన్ 2025లో కూడా ఈ కారు డెలివరీ కావాలంటే కస్టమర్లు నెలల తరబడి వెయిట్ చేయాలి. అయితే, పెట్రోల్ వెర్షన్, హైబ్రిడ్ వెర్షన్ లేదా CNG వెర్షన్.. ఇలా ప్రతి వేరియంట్‌కు వేర్వేరు వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి. ఏ వేరియంట్‌కు ఎంత సమయం పడుతుందో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.
ఎందుకు ఇంత క్రేజ్?
మారుతి బ్రెజాకు ఇంత డిమాండ్ ఉండడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా ఈ కారు ఇచ్చే మైలేజ్ అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా మారుతి సుజుకి బ్రాండ్ మీద ఉన్న నమ్మకం, సర్వీస్ నెట్‌వర్క్, రీసేల్ వాల్యూ వంటివి దీనికి ప్లస్ పాయింట్లు. ఇవి కాకుండా దాని స్టైలిష్ లుక్, మంచి రోడ్ ప్రెజెన్స్, లగ్జరీ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. సిటీ ట్రాఫిక్‌లో సులువుగా డ్రైవ్ చేసేందుకు, అలాగే సుదూర ప్రయాణాలకు కూడా ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది.
Read Also: మారుతి కార్ల వినియోగదారులకు గుడ్ న్యూస్..
బ్రెజా రకాలు, ఇంజిన్ ఆప్షన్లు
మారుతి బ్రెజా మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి: LXi, VXi, ZXi, ZXi+. వీటిని మీరు మూడు రకాల ఇంజిన్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. పెట్రోల్, మైల్డ్ హైబ్రిడ్, CNG. కస్టమర్‌ల అవసరాలకు, బడ్జెట్ కు తగినట్లు మారుతి ఈ వేరియంట్లను, ఇంజిన్ ఆప్షన్లను అందిస్తుంది. ఉదాహరణకు, ఎక్కువ మైలేజ్ కోరుకునే వారు సీఎన్జీ వైపు మొగ్గు చూపుతున్నారు.
బ్రెజా వెయిటింగ్ పీరియడ్
మారుతి బ్రెజా పెట్రోల్ (Brezza Petrol): LXi, VXi వేరియంట్లపై 4 నుంచి 6 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇందులో 1.5L పెట్రోల్ ఇంజిన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
మారుతి బ్రెజా మైల్డ్ హైబ్రిడ్: VXi, ZXi, ZXi+ వేరియంట్లపై 4 నుంచి 6 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఈ వెర్షన్ మ్యాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ రెండు గేర్‌బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.
మారుతి బ్రెజా CNG (Brezza CNG): LXi, VXi, ZXi వేరియంట్లపై 8 నుంచి 10 వారాల భారీ వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఇది అన్నిటికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న వెర్షన్, అందుకే దీనికి ఎక్కువ సమయం పడుతోంది.
Read Also: మారుతి గ్రాండ్ విటారా ఈవీ.. ఎంత వరకు భద్రం? క్రాస్ టెస్టింగ్ లో ఏం తేలింది?
బ్రెజా మైలేజ్
మారుతి బ్రెజాకు ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం దాని మైలేజ్ సామర్థ్యం. ఈ కారు లీటరుకు పెట్రోల్ వేరియంట్ 17.38కిమీ, మైల్డ్ హైబ్రిడ్ లీటరుకు 19.89కిమీ మైలేజ్ ఇస్తుంది. సీఎన్జీ కిలోకు 25.51కిమీ మైలేజ్ ఇస్తుంది. అందుకే ఈ కారుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.
మారుతి బ్రెజా ధరలు (ఎక్స్-షోరూమ్):
పెట్రోల్ / హైబ్రిడ్ ధరల విషయానికి వస్తే బేస్ మోడల్ 8.69 లక్షల నుంచి టాప్ మోడల్ రూ.13.98 లక్షల వరకు ఉంటుంది. CNG వేరియంట్లు బేసిక్ మోడల్స్ రూ.9.64 లక్షల నుంచి రూ.12.21 లక్షల వరకు ఉంటుంది. అంటే బేస్ వేరియంట్ నుండి టాప్ వేరియంట్ వరకు దాదాపు రూ.5.29 లక్షల వ్యత్యాసం ఉంది. ఇది కస్టమర్‌లకు వారి బడ్జెట్‌కు తగ్గట్టుగా సెలక్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సీఎన్జీ వెర్షన్ తీసుకోవాలనుకునే వారు కాస్త ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే 8 నుండి 10 వారాల వెయిటింగ్ పీరియడ్ అంటే దాదాపు రెండున్నర నెలల సమయం పడుతుంది. డిమాండ్ మరింత పెరిగితే ఈ వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగే అవకాశం ఉంది.