పవన్ 30వ సినిమా కోసం గురుశిష్యుల పోటీ?

నిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆయన నామస్మరణతోనే గడిపేశారు. పవన్ 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫ్యాన్స్ వేడుకలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పడంతోపాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక పవన్ తాజాగా నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ దర్శకులు ఒకదాని వెనుక ఒకటి ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు. పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో ఫుల్ […]

Written By: NARESH, Updated On : September 3, 2020 5:58 pm
Follow us on

నిన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్స్ అంతా ఆయన నామస్మరణతోనే గడిపేశారు. పవన్ 49వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఫ్యాన్స్ వేడుకలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెప్పడంతోపాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇక పవన్ తాజాగా నటిస్తున్న సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ దర్శకులు ఒకదాని వెనుక ఒకటి ఇవ్వడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీ అయ్యారు.

పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో ఫుల్ బీజీగా మారాడు. దిల్ రాజు నిర్మాణం తెరకెక్కుతున్న ‘వకీల్ సాబ్’ ఇప్పటికే 80శాతం షూటింగు పూర్తి చేసుకొంది. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. నిన్న పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘వకీల్ సాబ్’ మోషన్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. దీంతోపాటు పవన్-క్రిష్ కాంబోలో వస్తున్న సినిమాకు సంబంధించి ఫ్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. పవన్ తొలిసారి ఓ పీరియాడికల్ మూవీ చేస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్-హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న చిత్రానికి సంబంధించిన అప్డేడ్ కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

పవన్ చివరగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’లో నటించాడు. ఇది పవన్ 25వ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. పవన్ 26వ మూవీగా ‘వకీల్ సాబ్’ రాబోతుంది. ఆ తర్వాత వరుసగా దర్శకుడు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ కాంబినేషన్లో మూవీలు రాబోతున్నాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఈ నాలుగు సినిమాలతో బీజీగా ఉన్నాడు. దాదాపు మూడేళ్లపాటు ఆయన డేట్స్ ఖాళీగా లేనట్లు తెలుస్తోంది. అయితే తాజాగా పవన్ 30వ సినిమాపై టాలీవుడ్లో జోరుగా చర్చ జరుగుతోంది.

పవన్ 30వ సినిమా కోసం దర్శకుడు త్రివిక్రమ్, అతడి శిష్యుడు వెంకీ కుడుముల పోటీపడుతున్నారట. ఇప్పటికే త్రివిక్రమ్ తో పవన్ కల్యాణ్ ఓ మూవీ చేసేందుకు కమిట్ అయినట్లు తెలుస్తోంది. దర్శకుడు వెంకీ సైతం పవన్ కోసం ఓ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. వెంకీ కుడుముల త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పని చేశాడు. ఆ తర్వాత ఛలో, భీష్మ వంటి కమర్షియల్ హిట్లు సాధించి గురువు తగ్గ శిష్యుడు అనిపించుకున్నాడు. పవన్ 30వ సినిమా కోసం వీరిద్దరు పోటీపడుతుండటం ఆసక్తిని రేపుతోంది. వీరిద్దరిలో పవన్ ఎవరికి ఛాన్స్ ఇస్తారో వేచిచూడాల్సిందే..!