ఎన్టీఆర్ పాత ఇంట్లో త్రివిక్రమ్ !

త్రివిక్రమ్ గత వారం రోజులు నుండి డైలీ ఎన్టీఆర్ ఇంటికి వెళ్తున్నాడని.. ప్రస్తుతం ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మధ్య చర్చలు నడుస్తున్నాయని.. ప్రతి సీన్ ను త్రివిక్రమ్ తారక్ కు ఎక్స్ ప్లేన్ చేస్తున్నాడని.. ఈ సిట్టింగ్ తో దాదాపు స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని త్రివిక్రమ్ టీమ్ లోని ఓ అసిస్టెంట్ ద్వారా అందుతున్న సమాచారం. అయితే ఈ కథా చర్చలు జరుగుతుంది ఎన్టీఆర్ ప్రస్తుతం […]

Written By: admin, Updated On : September 3, 2020 5:39 pm
Follow us on


త్రివిక్రమ్ గత వారం రోజులు నుండి డైలీ ఎన్టీఆర్ ఇంటికి వెళ్తున్నాడని.. ప్రస్తుతం ‘అయినను పోయి రావలె హస్తినకు’ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పై త్రివిక్రమ్ – ఎన్టీఆర్ మధ్య చర్చలు నడుస్తున్నాయని.. ప్రతి సీన్ ను త్రివిక్రమ్ తారక్ కు ఎక్స్ ప్లేన్ చేస్తున్నాడని.. ఈ సిట్టింగ్ తో దాదాపు స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని త్రివిక్రమ్ టీమ్ లోని ఓ అసిస్టెంట్ ద్వారా అందుతున్న సమాచారం. అయితే ఈ కథా చర్చలు జరుగుతుంది ఎన్టీఆర్ ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో కాదు అట. ఎన్టీఆర్ కి మోహిదీపట్నంలో ఓ ఇల్లు ఉంది. గతంలో తారక్ ఆ ఇంట్లోనే ఉండేవారు. ఇప్పుడు ఆ ఇంటిలోనే త్రివిక్రమ్ – తారక్ స్క్రిప్ట్ పనుల్లో ఉన్నారట. ప్రతి సీన్ లో ఇన్ వాల్వ్ అవుతూ బెటర్ మెంట్ చేయడం తారక్ కి అలవాటు. అరవింద సమేత సినిమాలో కూడా చాలా పాయింట్స్ తారక్ చెప్పినివే అని ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో త్రివిక్రమే డైరెక్ట్ గా చెప్పిన సంగతి తెలిసిందే.

Also Read: హీరోయిన్ ఫీల్ ను అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ !

ఇప్పుడు ఈ స్క్రిప్ట్ లో కూడా తారక్ అలాగే ఇన్ వాల్వ్ అవుతున్నట్లు ఉన్నాడు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం త్రివిక్రమ్ నేటి భిన్నమైన రాజకీయ నేపథ్యం ఎంచుకున్నారని… సినిమాలో రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, ఎన్టీఆర్ గనుక రాజకీయ నేపథ్యంలో సినిమా చేస్తే.. అది తెలుగు తమ్ముళ్లుకు మంచి ఎనర్జీని ఇస్తోంది. ఎలాగూ తెలుగుదేశం కూడా సరైన స్టార్ డమ్ ఉన్న నాయకుడు లేక, రోజురోజుకు నిరసించిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ నుండి రాజకీయ సినిమా అనగానే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు పెరిగిపోయాయి.

Also Read: వయసు ముదిరినా తరగని అందం..

అందుకే త్రివిక్రమ్ కూడా ఈ సినిమాలో నటించే నటీనటుల విషయంలో కూడా భారీ తారగణాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంలో మలయాళీ స్టార్ మోహన్ లాల్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడని.. అలాగే బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆమెది పక్కా రాజకీయ నాయకురాలి పాత్ర అట. అలాగే ఎన్టీఆర్ పాత్ర కూడా రాజకీయాలకి ముడిపడి ఉంటుందట. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. వారిలో ఒకరిగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను అనుకుంటున్నారు. సెకెండ్ హీరోయిన్ గా రాశి ఖన్నాను తీసుకోవాలనే యోచనలో ఉన్నారు. ‘జై లవకుశ’లో ఎన్టీఆర్, రాశి ఖన్నాల జోడీ బాగా కుదిరింది. హారికా హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.