https://oktelugu.com/

అచ్చెన్న జగన్ కు జీవితాంతం రుణపడిపోవాలా….?

2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలపై 2014 – 2019 మధ్య కాలంలో అవినీతికి పాల్పడారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి. Also Read : బాబు వెంట […]

Written By: , Updated On : September 3, 2020 / 06:01 PM IST
Follow us on

achenna jagan will take a photo

2014లో నవ్యాంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిల పడింది. 175 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏపీలో కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. ఆ 23 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరంగా ఉన్నారు. మరికొంత మంది ఎమ్మెల్యేలపై 2014 – 2019 మధ్య కాలంలో అవినీతికి పాల్పడారనే ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి.

Also Read : బాబు వెంట ఉన్నది ఎంతమంది?

అలా ఏపీ ఈ.ఎస్.ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్యేలలో అచ్చెన్నాయుడు ఒకరు. ఈ కేసులో కొన్ని రోజులు జైలు జీవితం గడిపిన అచ్చెన్న తాజాగా బెయిల్ పై విడుదలయ్యారు. కరోనా బారిన పడిన అచ్చెన్న కొన్ని రోజుల క్రితమే వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే జగన్ సర్కార్ హయాంలో నమోదైన కేసులే అచ్చెన్న పాలిట వరంగా మారాయి. చంద్రబాబు అచ్చెన్నను ఏపీ టీడీపీ శాన‌స‌స‌భ ప‌క్ష ఉప‌నేతగా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

అచ్చెన్నకు పదవి దక్కితే మాత్రం ఆయన జగన్ కు జీవితాంతం రుణపడి ఉండాలి. జగన్ అచ్చెన్నను జైలుకు పంపకపోతే చంద్రబాబుకు అచ్చెన్నాయుడికి పదవి ఇవ్వాలనే ఆలోచన సైతం వచ్చి ఉండేది కాదని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నకు పదవి ఇవ్వడం ద్వారా ఉత్తరాంధ్రలోను, బీసీలలోను టీడీపీపై సానుకూలత వ్యక్తమయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న తరుణంలో అచ్చెన్నకు బాధ్యతలు అప్పగించడమే సరైన నిర్ణయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. త్వరలో అచ్చెన్న పదవికి సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read : ఏపీ కేబినెట్: వరాలు కురిపించిన జగన్