https://oktelugu.com/

Mahesh: త్రివిక్రమ్​- మహేశ్​ కాంబినేషన్​ మూవీ షూటింగ్​ స్టార్ట్​ అప్పటినుంచే!

Mahesh: సూపర్​ స్టార్​ మహేశ్​బాబు హీరోగా కీర్తి సురేశ్​ హీరోయిన్​గా తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట. దర్శకుడు పరశురామ్​ తెరకెక్కిస్తోన్న ఈ భారీ ప్రాజెక్టు తర్వాత.. మహేశ్​ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో కలిసి సినిమ చేసేందుకు సిద్ధమయ్యారు.  ఇటీవల ఇందుకు సంబంధించిన అప్​డేట్​ కూడా ఇచ్చింది చిత్రబృందం. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా పట్టాలెక్కనున్నట్లు ప్రకటించింది. దీంతో, మహేశ్​ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. మంచి యాక్షన్​ డ్రామా నేపథ్యంల పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 10, 2021 / 12:02 PM IST
    Follow us on

    Mahesh: సూపర్​ స్టార్​ మహేశ్​బాబు హీరోగా కీర్తి సురేశ్​ హీరోయిన్​గా తెరకెక్కుతోన్న సినిమా సర్కారు వారి పాట. దర్శకుడు పరశురామ్​ తెరకెక్కిస్తోన్న ఈ భారీ ప్రాజెక్టు తర్వాత.. మహేశ్​ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్​తో కలిసి సినిమ చేసేందుకు సిద్ధమయ్యారు.  ఇటీవల ఇందుకు సంబంధించిన అప్​డేట్​ కూడా ఇచ్చింది చిత్రబృందం. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్​లో సినిమా పట్టాలెక్కనున్నట్లు ప్రకటించింది. దీంతో, మహేశ్​ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

    మంచి యాక్షన్​ డ్రామా నేపథ్యంల పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాపై తాజాగా మరో వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్​ పనులు డిసెంబరు చివరి నాటికి పూర్తి కానున్నాయని సమాచారం. ప్రస్తుతం సర్కారు వారి పాటలో ఫుల్​ బిజీగా ఉన్న మహేశ్​.. ఆ సమయానికి షూటింగ్ కంప్లీట్​ చేసుకుని.. త్రివిక్రమ్​తో చేయబోయే సినిమా షూటింగ్​లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా కనిపించనుంది. థమన్​ సంగీతం అందిస్తున్నారు.

    మరోవైపు, భీమ్లానాయక్​ సినిమాకు త్రివిక్రమ్​ మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన రాసిన లాలా భీమ్లా పాట నెట్టింట వైరల్​గా మారింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ పాటను విడుదల చేసింది చిత్రబృందం. కాగా, సర్కారు వారి పాటతో ఫుల్​ బిజీగా ఉన్నారు మహేశ్​. వచ్చే ఏడాది ఎప్రిల్ 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరి ఖలేజా సినిమా తర్వాత మళ్లీ తిరిగి వీరిద్దరి కాంబినేషన్​లో రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.