Meat: ఆ రోజు ఆదివారం.. సంతోష్(పేరు మార్చాం) తన ఫ్యామిలీతో మహానగరంలోని ఓ పేరున్న రెస్టారెంట్‌కు డిన్నర్‌కని వెళ్లారు. ఫ్యామిలీతో సరదాగా కబుర్లు చెబుతూ డిన్నర్ ముగించారు. బిల్ టేబుల్ మీదికొచ్చింది. బిల్‌తోపాటు టిప్ కూడా ఇచ్చేసి కార్లో ఇంటికొచ్చేసారు. ఆ మర్నాడు పేపర్‌లో సంతోష్ డిన్నర్‌కు వెళ్లిన రెస్టారెంట్ గురించి పేపర్‌లో వచ్చింది. కల్తీ మాంసం కస్టమర్లకు పెడుతున్నారని, ఆ రెస్టారెంట్‌పై అధికారులు కేసు నమోదు నమోదు చేశారన్నది ఆ పేపర్‌లోని సారాంశం. ఇలా ఒక్క సంతోషే కాదు.. నగరంలోని చాలా మందికి ఇలా జరిగే ఉంటుంది. కానీ సంతోష్‌కు మాత్రం పేపర్‌లో రావడం వల్ల తెలిసింది.

హైదరాబాద్‌లో ఎక్కువ మంది మాంసంప్రియులన్నది అందరికీ తెలిసిందే. అయితే ఇదే కొందరి అత్యాశకు బిజినెస్ అయింది. కొందరు వ్యాపారులు అత్యాశతో నాసిరకం, కల్తీ మాంసాన్ని విక్రయిస్తున్నట్టు వెలుగులోకి వచ్చింది. అనారోగ్యానికి గురైన గొర్రెలు, మేకలు, చనిపోయిన జీవాలను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు గొడ్డు మాంసాన్నీ వ్యాపారులు కల్తీ చేస్తున్నారు. చనిపోయిన జంతువులను, అనారోగ్యకర జంతువులను తీసుకొచ్చి మార్కెట్‌లో అడ్డగోలుగా విక్రయిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పశువైద్య విభాగం అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి పట్టుకున్నా వీరి తీరులో మార్పు రావడం లేదు. నగరవ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి జరిపిన తనిఖీల్లో ఇప్పటి వరకు కల్తీ చేసిన 2851 కేజీల గొడ్డు మాంసం, 539 కేజీల పొట్టేలు మాంసం గుర్తించామని బల్దియా వెల్లడించింది. అవకతవకలు చేసిన 139 దుకాణాలపై మున్సిపల్ కోర్డులో కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇంత పెద్దఎత్తున మాంసం కల్తీ జరుగుతోందంటే హైదరాబాదీ ప్రజలు కాస్తా ఆలోచించి మాంసాన్ని విక్రయించాల్సిందే..
జియాగూడ నుంచి జీవాలు
హైదరాబాద్‌లో జరిగే మాంసం వ్యాపారంలో జియాగూడ కబేళా నుంచి వెళ్లే జీవాలు 80 శాతం ఉంటాయి. ఈ కబేళా కేంద్రంగా భారీ వ్యాపారం జరుగుతోంది. కశ్మీర్ నుంచి మొదలుపెడితే.. అనేక రాష్ట్రాల నుంచి జియాగూడ కబేళాకు జీవాలు వస్తాయి. అందులో అనారోగ్యమున్న జీవాలు, చనిపోయిన మేకలు, గొర్రెలు ఉంటాయని, వాటినీ వ్యాపారులు మార్కెట్‌కు తరలిస్తున్నారని ఫిర్యాదులున్నాయి. మాంసం దుకాణాలపై జరుపుతున్న తనిఖీల ఆధారంగా చూస్తే.. ఖైరతాబాద్ జోన్‌లో ఎక్కువగా కల్తీ మాంసం లభిస్తోందని, సికింద్రాబాద్, కూకట్‌పల్లి జోన్లలోనూ సంబంధిత దుకాణాలను గుర్తిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.
Also Read: Harish Rao: హరీష్ రావుకు ఈటల వదిలేసిన వైద్యఆరోగ్యశాఖ.. రివార్డా? శిక్షనా?
మరేం చేయాలి?
జీహెచ్‌ఎంసీ వెటర్నరీ విభాగం అధికారులు ఆమోద ముద్ర వేసిన జంతు కళేబరాల నుంచే మాంసాన్ని కొనుగోలు చేయాలని అధికారులు కోరుతున్నారు. అధికారిక కబేళాల్లో వధించిన మేక, గొర్రె పొట్టేలు, గొడ్డు మాంసాన్ని మాత్రమే ఉపయోగించాలంటున్నారు. జంతు కళేబరంపై బల్దియా ముద్ర ఉందా? లేదా? అని సరిచూసుకోవాల్సిన బాధ్యత పౌరులదేనని గుర్తుచేస్తున్నారు. ముద్ర గురించి దుకాణదారుడిని ప్రశ్నించాలని, అప్పుడే వ్యాపారులు నాణ్యమైన మాంసాన్ని విక్రయిస్తారని సూచిస్తున్నారు.
Also Read: Revanthreddy:రేవంత్ రెడ్డి ప్లాన్ బెడిసికొట్టిందా..? ప్రయత్నాలు వృథానేనా..?