షూటింగులకు ఏపీ సీఎం అనుమతి.. స్పందించిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ సీనిపెద్దలు నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బేటీ అయ్యారు. కరోనా నేపథ్యంలో షూటింగులు వాయిదాపడగా, థియేటర్లు మూసిపడిన సంగతి తెల్సిందే. లాక్డౌన్లో అన్నిరంగాలకు అనుమతి లభిస్తుండటంతో చిత్రపరిశ్రమకు మినహాయింపులు ఇవ్వాలని చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ పెద్దలు కదిలారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయి చర్చించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా, టీవీ షూటింగులకు పర్మిషన్ ఇస్తూ సోమవారం జీవో జారీ చేశారు. ఈనెల […]

Written By: Neelambaram, Updated On : June 9, 2020 8:26 pm
Follow us on


మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ సీనిపెద్దలు నేడు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో బేటీ అయ్యారు. కరోనా నేపథ్యంలో షూటింగులు వాయిదాపడగా, థియేటర్లు మూసిపడిన సంగతి తెల్సిందే. లాక్డౌన్లో అన్నిరంగాలకు అనుమతి లభిస్తుండటంతో చిత్రపరిశ్రమకు మినహాయింపులు ఇవ్వాలని చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ పెద్దలు కదిలారు. ఇందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయి చర్చించారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సినిమా, టీవీ షూటింగులకు పర్మిషన్ ఇస్తూ సోమవారం జీవో జారీ చేశారు. ఈనెల 15నుంచి తెలంగాణలో సినిమా షూటింగులు ప్రారంభం కానున్నాయి.

అదేవిధంగా ఏపీలోనూ జగన్మోహన్ రెడ్డి చిత్ర పరిశ్రమను ఆదుకునేందుకు అన్నివిధలా సాయం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చారు. దీంతో ఏపీ ముఖ్యమంత్రిని కలిసి తమ సంతోషం వ్యక్తం చేశారు. చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ సమస్యలు చర్చించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం అపార్ట్ మెంట్ ఇచ్చారు. దీంతో చిరంజీవి ఆధ్వర్యంలో టాలీవుడ్ పెద్దలు నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, సురేష్ బాబు తదితరులు ముఖ్యమంత్రి కలిసి టాలీవుడ్ సమస్యలపై చర్చించారు.

జగన్మోహన్ రెడ్డి టాలీవుడ్ పెద్దలు బేటీ ముగిశాక మెగాస్టార్ చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కలిసేందుకు ఏడాదిగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. కొన్ని అనివార్య కారణాలతో అది కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం ఆయనను కలిసి తమ సంతోషం వ్యక్తం చేసారు. జగన్మోహర్ రెడ్డి చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం అన్నిరకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. టీవీ, సినిమాలకు షూటింగులకు ఏపీలో అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను మంత్రి నానితో చర్చించాలని సూచించారని వెల్లడించారు.

థియేటర్ల ఓపెనింగ్ గురించి మాట్లాడినట్లు చెప్పారు. అదేవిధంగా థియేటర్ల ఫిక్స్ డ్ రేట్ల విషయంలోనూ ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. విశాఖలో చిత్రపరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ భూమి కేటాయించారని తెలిపారు. అందులో స్టూడియోలు, పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన పనుల కోసం తిరిగి పునరుద్ధరించేందుకు సీఎం అనుకూలంగా ఉన్నారని తెలిపారు. నంది అవార్డుల విషయంలోనూ అడిగిన వెంటనే ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. 2019-20 సంబంధించి నంది అవార్డుల ఫంక్షన్ త్వరలోనే ఉంటుందన్నారు. సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారానికి చేయూతనందిస్తున్నందుకు సీఎం జగన్మోహన్ రెడ్డికి టాలీవుడ్ తరుపున చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.