NTR: ‘దేవర’, ‘వార్ 2’ చిత్రాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వం లో ‘డ్రాగన్'(Dragon Movie) అనే సినిమా మొదలు పెట్టి, ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఈమధ్యనే అడవిలో ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించారు. నాన్ స్టాప్ గా ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనడం వల్ల ఆయన కాస్త అస్వస్థతకు కూడా గురి కావాల్సి వచ్చింది. దీంతో కొన్ని రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తిన చర్చ నడించింది. చాలా మంది ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆయన ‘దేవర 2’ చేస్తాడని అన్నారు.
మరికొంత మంది అయితే ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఎన్టీఆర్ సినిమా ఓకే అయ్యింది కదా, ఆ చిత్రమే మొదలు అవుతుందని చెప్పుకొచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ చిత్రం తెరకెక్కుతోందని అన్నారు. అయితే నెల్సన్ దిలీప్ కుమార్ ‘జైలర్ 2’ తర్వాత రజినీకాంత్, కమల్ హాసన్ మల్టీ స్టార్రర్ చిత్రం చేయడానికి ఆయన సిద్ధం అవుతున్నాడు. ఈ వారం లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబందించిన అప్డేట్ రాబోతుంది. ఒక చిన్న ప్రోమో ని కూడా విడుదల చేయబోతున్నారు. దీంతో నెల్సన్ దిలీప్ కుమార్ ఇప్పట్లో ఎన్టీఆర్ తో సినిమా తీసే అవకాశం లేదని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ తదుపరి చిత్రం పై ఎట్టకేలకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయబోతున్నాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ కార్తికేయ స్వామి జీవిత చరిత్ర ని ఆధారంగా తీసుకుని త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసుకున్న ‘గాడ్ ఆఫ్ వార్’ నే చేయబోతున్నారట.
ఈ సినిమా అల్లు అర్జున్ చేతుల్లోకి వెళ్లిపోయిందని కొన్ని రోజులు, ప్రభాస్ చేతుల్లోకి వెళ్లిందని మరికొన్ని రోజులు , రీసెంట్ గా రామ్ చరణ్ చేతుల్లోకి వెళ్లిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ అవన్నీ రూమర్స్ మాత్రమే, ‘గాడ్ ఆఫ్ వార్’ కథ ఎన్టీఆర్ తోనే చేయబోతున్నారు అనేది మరోసారి స్పష్టమైంది. ఇకపోతే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ తో కలిసి ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అవ్వగానే ఆయన ఎన్టీఆర్ చిత్రానికి షిఫ్ట్ అవ్వబోతున్నారు. టాలీవుడ్ హిస్టరీ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది.