Mrunal Thakur: గత కొంత కాలంగా మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పేరు వినిపిస్తే చాలు, మనకు వెంటనే ధనుష్(Dhanush K Raja) పేరు గుర్తుకొచ్చేది. ఎందుకంటే వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారని సోషల్ మీడియా లో ఎన్నో రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంతే కాదు, ఈ ఫిబ్రవరి నెలలోనే వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపించాయి. దానికి తోడు వీళ్లిద్దరు ఒక హోటల్ బయట ప్రైవేట్ గా కలిసి తిరిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో వీళ్ళ పెళ్లి రూమర్స్ మరింత బలపడింది. కచ్చితంగా వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ నెటిజెన్స్ ఒక నిర్ధారణకు కూడా వచ్చేసారు. ఇన్ని రోజులు మృణాల్ ఠాకూర్ ఈ విషయం పై స్పందించలేదు. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మృణాల్ ఠాకూర్ ఈ అంశం పై చాలా ఘాటుగానే రియాక్షన్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆమె మాట్లాడుతూ ‘గత కొంతకాలంగా సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారాలను గమనిస్తూనే ఉన్నాను. ధనుష్ నాకు అన్నయ్య లాంటోడు. మా ఇద్దరి మధ్య కేవలం ప్రొఫెషనల్ రిలేషన్ మాత్రమే ఉంది. అంతకు మించి మీరు అనుకుంటున్నట్టు ఏమి లేదు. అయిన ఒక అమ్మాయి వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు ఇన్ని రకాల వార్తలు పుట్టిస్తున్నారు. ఇన్ని రోజులు నేను దీని గురించి మాట్లాడలేదంటే, ఇది నిజమే అని ఒప్పుకున్నట్టు కాదు, ఇలాంటి రూమర్స్ కి స్పందించడం ఇష్టం లేకనే. దయచేసి ఇక నుండి అయినా ఈ రూమర్స్ కి చెక్ పెట్టండి’ అంటూ మృణాల్ ఠాకూర్ మాట్లాడినట్టు బాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది. ఇదంతా ట్విట్టర్ లోని ఒక పోస్ట్ కారణంగా జరిగింది. అకస్మాత్తుగా ఈ పోస్ట్ మృణాల్ ఠాకూర్ అనే పేరున్న హ్యాండిల్ నుండి రావడం తో, స్వయంగా మృణాల్ యే స్పందించిందని అనుకున్నారు.
కానీ అది ఆమె అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కాదు. కానీ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె ఇలా మాట్లాడినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో కోసం గాలిస్తున్నారు నెటిజెన్స్ , ఎక్కడ దొరకలేదు. దీంతో నిజంగానే మృణాల్ ఠాకూర్ ఇలా మాట్లాడిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘ధో దివానే సహార్ మెయిన్’ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నది. ఈ సినిమా ప్రొమోషన్స్ లో భాగంగా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఇలా మాట్లాడిందని అంటున్నారు. ఈ ఇంటర్వ్యూ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.