Cinema News: సినిమా వాళ్ళను ప్రజలు ఎందుకు దేవుడిలా ఆరాధిస్తారు , కోట్ల రూపాయలను తీసుకుని నటించడం తప్ప వాళ్ళు ప్రజలకి ఏం చేశారని ? ఇప్పుడు ఒక చర్చ మొదలయ్యింది. సరే, అసలు విషయానికి వస్తే.. సినిమా నటీనటులు రకరకాల పాత్రలు ధరిస్తారు. అందులో దేవుడు పాత్రలు కూడా వెండి తెరపై కనిపిస్తాయి. ఆ పాత్రలే నటుల పై ప్రేక్షకులకు అభిమానాన్ని పెంచుతాయి.

ఫలితంగా సినిమా వాళ్లపై ఆకర్షణ, అభిమానం కలిగిస్తాయి. అయితే, అది ముదిరిపోయి కొన్ని చోట్ల భక్తిగా కూడా మారుతుంది. గతంలో మూకీ చిత్రాలు వచ్చినప్పుడు ఆనాటి ప్రజలకు అదో విడ్డూరంగా అనిపించింది. సినిమాలు చూసి అబ్బో.. చాలా బాగుందే అని అనుకున్నారు. ఆ రోజుల్లో పురాణ పాత్రలు కూడా నటీనటులపై భక్తిని పెంచాయి.
సీనియర్ ఎన్టీఆర్ రామునిగా, కృష్ణునిగా, శివునిగా నటిస్తే, సాక్షాత్తు దైవం దిగి వచ్చాడా అన్నట్టు ఉండేది. దానికి తగ్గట్టు ఎన్టీఆర్ కూడా పురాణ పాత్రలు ధరించిన సమయంలో చాలా నిష్ఠగా ఉండేవారు. అది కూడా ఆయన పై భక్తి పెరగడానికి కారణం అయింది. అలాగే కె.ఆర్. విజయ అమ్మవారి పాత్ర ధరించాకా, ఎక్కడికి వెళ్లినా హారతులతో స్వాగతం పలికారు. పాదాభివందనం చేసేవారు.
Also Read:<Cinema Tickets: తెలంగాణలో సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో.. కేసీఆర్కు థ్యాంక్స్ చెప్తూ చిరు ట్వీట్
ఇక విజయ చందర్ ‘ కరుణామయుడు ‘ లో క్రీస్తు పాత్ర ధరించినపుడు సాక్షాత్తు జీసస్ దిగివచ్చినట్లు విశ్వాసులు భావించారు. ఊరూరా ఎదురొచ్చి, స్వాగతాలు చెప్పారు. ఆ చిత్రం తర్వాత ఆయనకో క్రేజ్ ఏర్పడింది. ఇలా నటీనటులను ఆరాధించడం మొదలుపెట్టారు.
అయితే, కోట్లాది రూపాయలు పారితోషికం తీసుకుంటూ, ప్రజలచే దేవుళ్లుగా గౌరవించబడుతున్న కళాకారులకూ సామాజిక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని నడుచుకోవాలి.