Hamsanandini: టాలీవుడ్ బ్యూటీ హంసనందిని ఇటీవలే క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం తను చికిత్స తీసుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ వార్త తెలియగానే అభిమానులంతా ఆమె ఆరోగ్యంపై స్పందస్తూ.. త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్తూ పోస్ట్ లు పెట్టారు. తాజాగా, హంసనందిని ఈ కామెంట్లపై స్పందించింది. తన మీద సానుభూతితో స్పందించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పింది. తన గురించి ఆలోచిస్తూ.. భగవంతుడికి ప్రార్థనలు చేసిన వారంరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
A big Thank You to everyone for your thoughts,prayers & encouragement.
Your unbridled love comforts me beyond words.I am humbled by the outpouring of concern from every corner & grateful for the support of my fans,friends,family & fraternity.
You make me stronger! #swanstories pic.twitter.com/Es2OJUhJIb— Hamsa Nandini (@ihamsanandini) December 25, 2021
తనమీద చూపించిన అభిమానం మాటల్లో చెప్పలేనంత ఓదార్పు కలిగించిందని పేర్కొంది. వారి సపోర్ట్ తనకు ఎందో ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ” వంశీ అనుమానాస్పదం” చిత్రంతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు హంసానందిని. ఈ సినిమా అనుకున్నంత విజయం అందుకో పోవడంతో ఆమెకు ఆశించినంత మెరకు హీరోయిన్ గా సినిమా అవకాశాలు దక్కలేదనే చెప్పుకోవాలి.
ఆ తర్వాత సెకండ్ హీరోయిగానూ, వేంప్ రోల్స్, ఐటెమ్ గాళ్ గానూ పలు చిత్రాల్లో నటిస్తూ తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. అత్తారింటికి దారేది,ప్రభాస్ మిర్చి మూవీలోని టైటిల్ సాంగ్ తో హంసానందిని మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ తర్వాత మళ్లీ పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.