Homeఎంటర్టైన్మెంట్ఆ హీరోయిన్లు.. ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?

ఆ హీరోయిన్లు.. ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?

Heroines who are Unmarried

మనిషి జీవితం పెళ్లితోనే సంపూర్ణం అంటారు. మహిళలైతే ఇక చెప్పాల్సిన ప‌నేలేదు. పెళ్లి కావాలి.. ఆ త‌ర్వాత త‌ల్లికూడా కావాలి. అప్పుడే.. ఆమె జీవితం ప‌రిపూర్ణం అంటారు. అయితే.. అవ‌న్నీ పాత ముచ్చ‌ట్లు అంటున్నారు నేటిత‌రం మ‌హిళ‌లు. స్వ‌శ‌క్తితో ఎదిగి, సొంత‌కాళ్ల‌పై నిల‌బడేవారు సింగిల్ గా ఉండ‌డానికే ఇష్ట‌ప‌డుతున్నారు. పెళ్లే జీవితం కాద‌ని అంటున్నారు. పెళ్లి బంధంలోకి అడుగు పెడితే.. స్వ‌తంత్రం పోతుంద‌ని భావించారో.. అన‌వ‌స‌ర ‘ల‌గేజ్’ మెడ‌కు పడుతుందని అనుకున్నారో కానీ.. వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టకుండా బతుకు బండిని డ్రైవ్ చేస్తున్నారు. అంతేకాదు.. సోలో డ్రైవ్ చాలా హ్యాపీగా ఉందని కూడా చెబుతున్నారు. మ‌రి, ఆ ‘సింగిల్’ పీసులు ఎవ‌రో చూద్దాం..

ట‌బుః మోస్ట్ సీనియ‌ర్ గా ఉన్న ట‌బు వ‌య‌సు 50 ఏళ్లు. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. బాలీవుడ్ తోపాటు తెలుగులోనూ స‌త్తా చాటిన ఈ బ్యూటీ.. త‌న‌దైన ఆలోచ‌న‌తో ముందుకు సాగుతోంది. పెళ్లి చేసుకుంటునే హ్యాపీగా ఉంటార‌నే విష‌యాన్ని తాను న‌మ్మ‌న‌ని చెబుతోంది. ‘‘మ‌న ఇష్టాల‌ను గౌర‌వించ‌ని వ్య‌క్తి మ‌న జీవితంలోకి వ‌స్తే.. అంత‌క‌న్నా దారుణ పరిస్థితి మ‌రొక‌టి ఉండ‌దు. అందుకే.. నాకు ఇష్టమైన ప్రపంచంలో సాగుతాను’’ అని స్పష్టం చేసింది.

సుస్మితా సేన్ః విశ్వ సుంద‌రిగా స‌త్తా చాటిన ఈ బ్యూటీ.. న‌టిగానూ హ‌వా సాగించింది. ప్ర‌స్తుతం ఈమె వ‌య‌సు 50 సంవ‌త్స‌రాల‌కు ద‌గ్గ‌ర్లో ఉంది. ఇద్ద‌రు చిన్నారుల‌ను ద‌త్త‌త తీసుకుంది. వారితోనే లైఫ్ లీడ్ చేస్తోంది. రోమ‌న్ షాల్ తో డేటింగ్ చేస్తున్న‌ప్ప‌టికీ.. పెళ్లి గురించి మాత్రం మాట్లాడ‌డం లేదు. ప్ర‌స్తుతం తాను సింగిల్ గా చాలా సంతోషంగా ఉన్నాన‌ని చెబుతోంది.

అమీషా ప‌టేల్ః తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మ‌హేష్ బాబు, జూనియ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించిన అమీషా ప‌టేల్‌.. బాలీవుడ్ లో స్టార్ గా కొన‌సాగింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ వ‌య‌సు 46 సంవ‌త్స‌రాలు. అయినా.. పెళ్లి గురించిన ఆలోచ‌నే చేయ‌డంలేదు.

న‌గ్మాః తెలుగుతోపాటు ప‌లు ఇండ‌స్ట్రీల్లో టాప్ హీరోయిన్ గా కొన‌సాగిన ఈ బ్యూటీ వ‌య‌సు ప్ర‌స్తుతం 46 ఏళ్లు. అయినా.. పెళ్లి చేసుకోవ‌డానికి ఇంట్ర‌స్ట్ చూపించ‌ట్లేదు. ప్ర‌స్తుతం రాజ‌కీయ నేత‌గా త‌న జ‌ర్నీ కంటిన్యూ చేస్తోంది.

కౌస‌ల్యః టాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో హీరోయిన్ గా న‌టించిన కౌస‌ల్య కూడా పెళ్లి చేసుకోలేదు. న‌ల‌భై ఏళ్లు దాటిపోయినా.. పెళ్లి గురించి మాట్లాడ‌డం లేదు.

శోభ‌నః తెలుగు టాప్ హీరోయిన్ గా వెలిగిన శోభ‌న వ‌య‌సు ప్ర‌స్తుతం 51 సంవ‌త్స‌రాలు. ఈమె కూడా పెళ్లి చేసుకోవ‌ద్ద‌నే నిర్ణ‌యానికి వ‌చ్చింది. పెళ్లికంటే జీవితంలో ఆనందాన్ని పంచే విష‌యాలు చాలా ఉన్నాయ‌ని చెబుతోంది. అయితే.. ఏం చేయాల‌నేది అది మ‌న‌పైనే ఆధార‌ప‌డి ఉంటుంద‌ని, సింగిల్ గా తాను చాలా హ్యాపీగా ఉన్నాన‌ని చెబుతోంది.

సితారః తెలుగులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సితార కూడా పెళ్లి చేసుకోలేదు. ఈమె వ‌య‌సు 48 ఏళ్ల‌కు ద‌గ్గ‌ర్లో ఉంది. సింగిల్ గానే హ్యాపీగా ఉన్నాన‌ని చెబుతోంది.

త‌నీషా ముఖ‌ర్జీః బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ సోద‌రి అయిన త‌నీషా.. ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్లి చేసుకోలేదు. వ‌య‌సు 43 సంవ‌త్స‌రాలు. బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ అమ్మ‌డు పెళ్లిపై త‌న‌దైన అభిప్రాయం వ్య‌క్తం చేస్తోంది. జీవితంలో పెళ్లి, పిల్ల‌లు ఒక భాగం మాత్ర‌మేన‌ని చెబుతోంది. పెళ్లి చేసుకోక‌పోయినా, పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా పోయేది ఏమీ లేద‌ని తేల్చి చెప్పింది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version