నేను కప్ప, మరీ మీరు ఏ జంతువు ?

‘రాధికా ఆప్టే’ ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్రత్యేకంగానే ఉంటుంది. బోల్డ్ హీరోయిన్ గా ముద్ర వేసినా పద్దతిగల పాత్రలకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. కానీ నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో వార్తలెక్కడం ఆమెకు ఆనవాయితీ. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన రాధికా ఆప్టే.. మనుషులంతా జంతువులే అంటూ తాజాగా ఒక బోల్డ్ స్టిల్ తో పాటు ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది. ప్రతీ ఒక్కరూ జంతువే అని, అయితే, తాను మాత్రం ఓ […]

Written By: admin, Updated On : July 27, 2021 12:10 pm
Follow us on

‘రాధికా ఆప్టే’ ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్రత్యేకంగానే ఉంటుంది. బోల్డ్ హీరోయిన్ గా ముద్ర వేసినా పద్దతిగల పాత్రలకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్. కానీ నిత్యం వివాదాస్పద కామెంట్స్ తో వార్తలెక్కడం ఆమెకు ఆనవాయితీ. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిన రాధికా ఆప్టే.. మనుషులంతా జంతువులే అంటూ తాజాగా ఒక బోల్డ్ స్టిల్ తో పాటు ఒక మెసేజ్ కూడా పోస్ట్ చేసింది.

ప్రతీ ఒక్కరూ జంతువే అని, అయితే, తాను మాత్రం ఓ కప్పలా కనిపిస్తాను అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. కప్ప అంటే.. తనకు కప్ప కళ్ళు, కప్ప పెదవులు ఉన్నాయంటూ తన శరీర భాగాల గురించి రాధిక చెప్పుకొచ్చింది. అలాగే మరీ మీరు ఏ జంతువు ? అంటూ తన ఫాలోవర్స్ ను కూడా ఎదురు ప్రశ్నించింది. నెటిజన్లు కూడా రాధికాకి తమదైన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు.

ఇక రాధికా ఆప్టే పోస్ట్ చేసిన స్టిల్ లో ఆమె బికినీలో దర్శనమిచ్చారు. అయితే తన ఒంటిని టవల్‌ తో కవర్ చేసి పరిధి దాటలేదు. ఇక ప్రస్తుతం రాధిక పోస్ట్ చేసిన ఈ కామెంట్ అండ్ స్టిల్ బాగా వైరల్ అవుతోంది. అన్నట్టు తాజాగా ‘రాధికా ఆప్టే’ ఒక వెబ్ సిరీస్ ను నిర్మించడానికి సన్నద్ధం అవుతుంది. ఆ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ కూడా ఆమెనే.

మరి తన నిర్మాణంలో వెబ్ సిరీస్ వస్తోంది కాబట్టి.. ఆ సిరీస్ పై రాధికా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటుంది. స్క్రిప్ట్ దగ్గర నుండి గెటప్స్ వరకూ చాలా కేర్ తీసుకుని షూట్ ను ప్లాన్ చేస్తోంది.