ఈ సినిమాలో వినసొంపైన సంగీతం ఉంది, ఆకట్టుకునే కెమెరా అందాల మేళవింపు ఉంది. అందుకే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అంటున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమా టీమ్ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు బండారు దానయ్య కవి మాట్లాడుతూ ‘ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది.
ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు వంటి సీనియర్ ఆర్టిస్టులు నటించడం, వారిని డైరెక్ట్ చేసే అవకాశం నాకు రావడం నేను గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇక ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన పాటలకు జూక్ బాక్స్ లో మిలియన్ వ్యూస్ రావడం మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు.
అన్నట్టు ఈ సినిమాను ప్రేక్షకులకు ఇంకా చేరువ చేయాలనే ఉద్దేశంతో రేడియో మిర్చితో కలిసి ‘చిత్రపటం’ పాటల కాంటెస్ట్ ను నిర్వహిస్తున్నారు. వినాయక చవితికి విన్ అయిన శ్రోతలకు ఎలక్ట్రిక్ బైక్ లను బహుమతి ప్రదానం చేయబోతున్నారు. మరి ఎలక్ట్రానిక్ బైక్ లను గెలుచుకోవాలని ఆశ పడుతున్నవారు ‘చిత్రపటం’ పాటల కాంటెస్ట్ లో పాల్గొని గెలవండి.