https://oktelugu.com/

Sreeja : విడాకులపై సంచలన ప్రకటన చేసిన చిరంజీవి కూతురు శ్రీజ

ఇదే ఎన్నో ప్రశ్నలకు సమాధానం అంటూ తెలిపింది శ్రీజ. ఈ పోస్టు చూసిన నెటిజన్లు కళ్యాణ్ దేవ్ గురించి పెట్టిందా? లేక విడాకుల గురించి అడిగే వారికి పెట్టిందా అంటూ సతమతం అవుతున్నారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 20, 2024 / 05:38 PM IST

    Sreeja

    Follow us on

    Sreeja : టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఈ సంఘటన గతంలో హాట్ టాపిక్ గా మారింది. ఈ జంటకు ఓ పాప కూడా పుట్టింది. కానీ కొన్ని మనస్పర్థల వల్ల ఇద్దరు విడిపోయారు. ఇక కూతురు బాధను చూడలేక కళ్యాణ్ దేవక్ కు ఇచ్చి పెళ్లి చేశారు మెగాస్టార్.

    ఈ ఇద్దరికి కూడా ఒక పాప పుట్టింది. ఆమె పేరు నవిష్క. ఇద్దరు బాగున్నారు. కలిసి మెలిసి ఉంటున్నారు అనుకునేలోపే వారి పోస్టులు అభిమానుల్లో గుబులు పుట్టించాయి. అందరూ ఊహించనట్టు కళ్యాణ్ దేవ్, శ్రీజ ఇద్దరు కూడా విడిపోయారు. చివరకు శ్రీజ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి మెగా ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు విడిపోయినా కూడా అధికారికంగా ప్రకటించలేదు.

    కానీ కొన్ని కొన్ని పోస్టులను గమనిస్తే ఇద్దరి పోస్టులు కూడా విడిపోయినట్టే అనిపించేవి. మెగా అల్లుడు తన కూతురు సవిష్కను ఇంటికి తీసుకొని వచ్చి ఎమోషనల్ పోస్టులు పెట్టడంతో విడాకులు కన్ఫమ్ అయ్యాయి. అప్పటి నుంచి శ్రీజను విడాకుల గురించి అడుగుతుంటారు నెటిజన్లు. కానీ వీటి విషయంలో ఇప్పటికీ శ్రీజ స్పందించలేదు. తన బిజినెస్ ను స్టార్ట్ చేసి ఫుల్ బిజీ అయిపోయింది ఈ మెగా కూతురు.

    ఇదెలా ఉంటే రీసెంట్ గా శ్రీజ తన ఇన్ స్టా స్టోరీలో అందరి ప్రశ్నలకు ఒకే విధంగా సమాధానం అందించింది. ఎవరైనా తమను తాము ఏ స్థాయిలో ఊహించుకుంటారో అదే స్థాయిలో చూస్తారు అని.. అదే స్థాయి కావాలి అనుకుంటారు. ఇదే ఎన్నో ప్రశ్నలకు సమాధానం అంటూ తెలిపింది శ్రీజ. ఈ పోస్టు చూసిన నెటిజన్లు కళ్యాణ్ దేవ్ గురించి పెట్టిందా? లేక విడాకుల గురించి అడిగే వారికి పెట్టిందా అంటూ సతమతం అవుతున్నారు.