Coaching Centers: కోచింగ్ సెంటర్లు కావవి..కోట్లు సంపాదించే సెంటర్లవి

సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ స్థాయిలో ఖర్చు చేస్తుండగా.. వారి ఆశలు.. అవసరాలను ఆసరాగా చేసుకుని కోచింగ్ సెంటర్లు ప్రతీ ఏటా వేలకోట్ల రూపాయాల వ్యాపారం చేసేస్తున్నాయి.

Written By: Neelambaram, Updated On : May 20, 2024 5:41 pm

Coaching Centers

Follow us on

Coaching Centers: దేశంలో సివిల్ సర్వెంట్లకు ఏ స్థాయి పేరు,ప్రతిష్టలు ఉంటాయో అందరికీ తెలిసిందే. ఎంతోమంది యువత ఐఎఎస్,ఐపిఎస్,ఐఆర్ఎస్, ఇతర కేంద్ర సర్వీసు ఉద్యోగాలు సంపాదించేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఎంత ఖర్చయినా ఫర్వాలేదనుకొని అనేక మంది అభ్యర్థులు లక్షలు రూపాయాలు ధారపోసి..ఢిల్లీ,ముంబై,చెన్నై, హైదరాబాద్,బెంగళూరు వంటి నగరాల్లో ఏళ్ల తరబడి కోచింగ్లు తీసుకుంటారు. ఇందుకోసం వారు ప్రతీ ఏటా భారీగానే ఖర్చు చేస్తుంటారు. ఇలా సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల్లోని పేదలు తమ ఇండ్లు,వాకిళ్లు అమ్ముకొని కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్న సందర్భాలూ కోకొల్లలు.

ఇక సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఈ స్థాయిలో ఖర్చు చేస్తుండగా.. వారి ఆశలు.. అవసరాలను ఆసరాగా చేసుకుని కోచింగ్ సెంటర్లు ప్రతీ ఏటా వేలకోట్ల రూపాయాల వ్యాపారం చేసేస్తున్నాయి. ప్రతీ సంవత్సరం యూపీపిఎస్సీ 1000 నుంచి 1100 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తుంటుంది. అయితే ఇంత తక్కువ పోస్టులకు నిరుద్యోగుల నుంచి భారీ పోటీనే ఉంటుంది. ప్రతీ 1000 మంది అభ్యర్థుల్లో ఇద్దరు మాత్రమే ఉద్యోగాన్ని పొందగలుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతీ అభ్యర్థి మిగతా అభ్యర్థి కన్నా.. మెరుగైన ప్రతిభను కనబర్చాలనే భావనతో ఢిల్లీ, హైదరాబాద్,బెంగళూరు, బాంబే,మద్రాస్,కలకత్తా వంటి నగరాల్లోని కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.

అయితే భారీ స్థాయిలో అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు క్యూ కట్టడం వారికి కలిసొస్తుంది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఆశలను ఆసరాగా చేసుకొని లక్షల్లో ఫీజులను వసూలు చేస్తున్నారు. తక్కువలో తక్కువ ఒక్కో అభ్యర్థి నుంచి 50 వేల నుంచి రెండు లక్షల వరకూ లాగేస్తున్నట్టు అంచనా. ఇలా ప్రతీ యేట ఒక మెట్రో నగరాల్లోనే సివిల్ సర్వెంట్ ఆస్పరెంట్ల నుంచి కోచింగ్ సెంటర్లు సుమారు 3-4 వేల కోట్ల రూపాయలను దండుకుంటున్నాయి. అయితే ఈ స్థాయిలో ఫీజులను వసూలు చేస్తున్నప్పటికీ.. పేరొందిన కోచింగ్ సెంటర్లలో సైతం సక్సెస్ రేటు 1-2 శాతమే ఉండడం విస్మయం కలిగిస్తోంది. దీంతో అభ్యర్థుల ప్రతిభ ప్రకారమే.. సివిల్ సర్వీసెస్ జాబ్స్ వస్తున్నప్పటికీ..అందులో తమ పాత్రే అధికమని డంకా భాజాయించి కోచింగ్ సెంటర్లు చెప్పుకుంటుండడం కొస మెరుపు.