Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైన చిత్రం ‘ఠాగూర్’. వీవీ వినాయక్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ చిత్రం 2003 వ సంవత్సరం లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఈ చిత్రానికి ముందు చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ చిత్రం ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అప్పటి వరకు ఉన్నటువంటి ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి , ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ఈ సినిమా తర్వాత ఎలాంటి చిత్రం చేస్తే అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందుతారో, అలాంటి సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావడం తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. అయితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తి కరమైన విషయాలను మీ ముందు ఉంచబోతున్నాము.
ఇది తమిళంలో విజయ్ కాంత్ హీరో గా నటించిన ‘రమణ’ అనే సూపర్ హిట్ చిత్రానికి రీమేక్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకుడు. ముందుగా ఈ చిత్రాన్ని సీనియర్ హీరో రాజశేఖర్ చెయ్యాలని అనుకున్నాడు , కానీ ఆ తర్వాత నిర్మాత మధు భారీ మొత్తం లో డబ్బులు చెల్లించి రీమేక్ రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. తెలుగు లో కూడా ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం మురుగదాస్ కి ఇచ్చాడు మెగాస్టార్. కొన్ని నెలల పాటు చర్చలు కూడా జరిగాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి చెప్పిన కొన్ని మార్పులు చేయడానికి మురుగదాస్ అంగీకరించలేదు. ‘రమణ’ చిత్రం క్లైమాక్స్ లో హీరో విజయ్ కాంత్ చనిపోతాడు. తెలుగు లో ఆ క్లైమాక్స్ పెట్టడానికి చిరంజీవి ఒప్పుకోలేదు. మరోపక్క మురుగదాస్ కూడా క్లైమాక్స్ మార్చడానికి ఒప్పుకోలేదు. హీరో పాత్ర గొప్ప త్యాగమూర్తి, కథ ప్రకారం ఆయన చనిపోవాలి సార్, మారిస్తే సినిమా బాగుండదు అని చెప్పాడట.
అప్పుడు చిరంజీవి ఇక్కడ నేను చనిపోయినట్టు చూపిస్తే అభిమానులు అసలు ఊరుకోరు, ఫ్లాప్ చేస్తారు , నిర్మాత చచ్చిపోతాడు అని చెప్పాడట. అంతే కాకుండా సినిమాలో పాటలను కూడా చేర్చి కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించాలి అని చెప్పాడట చిరంజీవి. అందుకు కూడా మురుగదాస్ ఒప్పుకోలేదట , అలా చేస్తే సినిమా పాడైపోతుంది అనేది ఆయన వాదన. అందుకే ఆయన ఈ చిత్రం నుండి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ డైరెక్టర్ వీవీ వినాయక్ ఈ చిత్రాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో చక్కగా ప్యాక్ చేసి , ఎంత అద్భుతంగా తీసాడో మనమందరం చూశాము. తమిళం లో కంటే తెలుగు లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.