
కరోనా లాక్ డౌన్ వల్ల నూటికి 80 మందికి తమ భవిష్యత్ గురించి బెంగ ఏర్పడి ఉంటుంది .నిస్సందేహం గా …అలాంటి వారిని ఉపశమనం కోసం మెగా స్టార్ చిరంజీవి తన ట్విట్టర్ ఖాతాలో ఒక సలహా ఇవ్వడం జరిగింది. లాక్‌డౌన్ సమయంలో చాలా మంది ఇంట్లోనే ఉంటూ, తమ భవిష్యత్తుపై దిగులు చెందుతూ ఉన్నారని, అలాంటి వారు ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ చేయాలని సలహా ఇచ్చారు. అంతేకాదు ఈ క్లిప్‌లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయాలని కోరారు. ఈ మధ్య కాలంలో తాను చేసిన డ్యాన్సు బిట్లను ఈ రోజు సాయంత్రం తాను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తానని చెప్పారు.
స్టార్ హీరో రిషి కపూర్ ఆకస్మిక మృతి
వరల్డ్ డ్యాన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తనకి , డాన్స్ కి గల అనుబంధాన్ని గుర్తు చేస్తూ , ఈ డాన్స్ నాకు కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించి పెట్టిందని చెప్పారు. ఏప్రిల్ 29 ప్రపంచ నాట్య దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ఒకసారి గుర్తుచేసుకోవడం తన కెంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు విశేషం ఏమిటంటే సరిగ్గా 32 ఏళ్ళ కృతం డే రోజున చిరంజీవి నటించిన `యముడికి మొగుడు ` చిత్రం విడుదలై .గొప్ప మ్యూజికల్ హిట్ అయ్యింది. ఆ సినిమాలో చిరంజీవి చేసిన డాన్స్ లకు అనూహ్య స్పందన రావడమే గాక ఆ చిత్రం యొక్క విజయంలో అవే కీలకమయ్యాయి .