Chiranjeevi Srikanth Odela movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Churanjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపుని తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం…మరి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయన వైపు తిప్పుకున్న ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన విశిష్ట (Vashishtha) డైరెక్షన్ లో విశ్వంభర (Vishwambhara) అనే సినిమా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇంక దాంతోపాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. 2026 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాల విషయం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆయన ఈ సినిమాతో ఎలాంటి ఐడెంటిటి సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఈ మూవీ లో వింటేజ్ చిరంజీవి కనిపించబోతున్నడనే వార్తలైతే వినిపిస్తున్నాయి… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చిరంజీవి శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో సినిమా చేస్తాడా లేదా అనేదానిమీద ఇంకా సరైన క్లారిటీ అయితే రావడం లేదు. ప్యారడైజ్ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే ఆ సినిమా పట్టాలెక్కుతోంది.
Also Read: ‘కింగ్డమ్’ లో విజయ్ దేవరకొండ రియల్ స్టంట్స్ ఇలా ఉండబోతున్నాయా..?
లేకపోతే మాత్రం ఆ సినిమా పట్టాలెక్కడం చాలా కష్టం అనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ ఓదెలతో సినిమా చేయక వద్దా అనే చిన్న డైలమాలో ఉన్న చిరంజీవి అతనికి ఆల్టర్నేట్ గా మరో కొత్త దర్శకుడిని ఎంచుకున్నట్టుగా కూడా తెలుస్తోంది…ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు అంటే హరీష్ శంకర్ గా తెలుస్తోంది.
హరీష్ శంకర్ కూడా కమర్షియల్ సినిమాలు బాగా డీల్ చేస్తాడు. దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా చిరంజీవికి ఒక కథనైతే వినిపించారట. మరి ఆ కథ కూడా చిరంజీవికి బాగా నచ్చడంతో ఆ సినిమా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి శ్రీకాంత్ ఓదెలతో కమిట్ అయిన సినిమాకి బదులు ఈ సినిమాని చేస్తాడా? లేదంటే శ్రీకాంత్ ఓదెల సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమా చేస్తాడా అనే విషయంలోనే క్లారిటీ మిస్ అవుతోంది.
Also Read: రాజమౌళి – మహేష్ బాబు డూప్ ను వాడకపోవడానికి కారణం అదేనా..?
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టే విధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఆయన సినిమాలను చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇప్పుడు తను అనుకున్న రేంజ్ లో సక్సెస్ సాధించగలుగుతాడా? ఇప్పుడున్న స్టార్ హీరోలందరికి పోటీని ఇస్తూ సీనియర్ హీరోలందరిని పక్కనపెట్టి అతను ముందుకు దూసుకెళ్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…