Andhra Telangana Rains: తెలుగు రాష్ట్రాల్లో( Telugu States ) భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూలై మూడో వారంలో కూడా ఉష్ణోగ్రతలు అధిక స్థాయిలో నమోదవుతున్నాయి. ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు వాతావరణ శాఖ నుంచి తీపి కబురు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజులపాటు వర్షాలు పడతాయని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండం గా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ కారణంగానే ఏపీతోపాటు తెలంగాణలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత కొద్ది రోజులుగా విపరీతమైన ఎండలు, ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోయారు. వారికి ఇది నిజంగా ఉపశమనం కలిగించే విషయం.
వర్షాలు ప్రారంభం..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభం అయ్యాయి. తీవ్ర వేడి నుంచి ఉపశమనం దొరుకుతుంది ప్రజలకు. శుక్రవారం నుంచి ఈనెల 23 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. ప్రస్తుతం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండం గా బలపడనుంది. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్( Uttar Pradesh) లో కొనసాగుతోంది. దీని నుంచి విస్తరించిన రుతుపవన ద్రోణి తూర్పు బంగాళాఖాతంలోని ఈశాన్య ప్రాంతం వరకు ఉంది. ఉత్తర తమిళనాడు మీదగా తూర్పు, పడమరగా మరో ద్రోణి విస్తరించి ఉంది. అందుకే వర్షాలు అధికంగా పడే అవకాశం ఉంది. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో వాతావరణంలో మార్పులు సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతంలో ఎండ తీవ్రతతో పాటు మధ్యాహ్ననికి వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ 23 వరకు ఇలా వర్షాలు కొనసాగనున్నాయి.
Also Read: Jagan Speech Mistakes: జగన్ నోటి నుంచి మరో రెండు ఆణిముత్యాలు..వైరల్!
ఈరోజు మరో ఆవర్తనం..
మరోవైపు బంగాళాఖాతంలో( Bay of Bengal) ఈరోజు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దక్షిణ కోస్తాకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఈ ఉపరితల ఆవర్తనం ఆవరించనుంది. బంగాళాఖాతం నుంచి తేమ మేఘాలు కోస్తా తో పాటు రాయలసీమ పై వీయనున్నాయి. అరేబియా సముద్రంలో బలపడిన రుతుపవన మేఘాలు దక్షిణ భారతదేశంలో విస్తరించనున్నాయి. ఏపీ పై కూడా ప్రభావం చూపుతాయి. వీటితో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈనెల 23 వరకు పిడుగులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.