Rajamouli Mahesh Babu movie: దర్శకధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి(Rajamouli)…ఆయన చేసిన చాలా సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెట్టినవే కావడం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిద్య భరితమైన కథాంశం అయితే ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వరుస సినిమాలతో సక్సెస్ లను సాధిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ఆయన మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ప్రపంచ ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూట్ గత ఏడు నెలల క్రితమే స్టార్ట్ అయినప్పటికి ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ మాత్రమే కంప్లీట్ చేశారు… ఇక మూడో షెడ్యూల్ జరుగుతుంది అంటు కొన్ని వార్తలు వస్తున్నప్పటికి దాని మీద ఏ మాత్రం క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు…ఇక దాంతోపాటుగా మహేష్ బాబు కి డూప్ ని పెట్టకుండా స్వతహాగా అతనితోనే అన్ని స్టంట్స్ ని చేయిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఎందుకని రాజమౌళి ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని కొంతమంది కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇదంతా బిజినెస్ స్ట్రాటజీ అని చెప్తున్నారు ఎందుకంటే ఈ సినిమా మేకింగ్ వీడియో ను సైతం భారీ రేంజ్ లో అమ్ముకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు ఒరిజినల్ గా స్టంట్స్ చేస్తే ఆ మేకింగ్ వీడియోలు భారీ డబ్బులకు అమ్ముకోవచ్చు అనే ఉద్దేశ్యంతో అలా చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: జూనియర్ ఫుల్ మూవీ రివ్యూ… హిట్టా?ఫట్టా?
ఇక మొత్తానికైతే మూడో షెడ్యూల్ ఇప్పుడప్పుడే జరిగే దాఖలాలు లేనట్టుగా కనిపిస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం రాజమౌళి ఈ మూవీ మూడో షెడ్యూల్ ని చేస్తున్నాడు అంటుకొని వార్తలు వస్తున్నప్పటికి అవేవి నిజం కాదనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక కెన్యా అడవుల్లో మూడో షెడ్యూల్ ఉండబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ షూట్ ఎప్పుడూ ఉంటుందనే దాని మీద క్లారిటీ అయితే లేదు…
ఇక భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తెరకెక్కించే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారట. మరి ఏది ఏమైనా కూడా రాజమౌళి లాంటి దర్శకుడు నుంచి వస్తున్న సినిమా భారీ ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… బాహుబలి(Bahubali), త్రిబుల్ ఆర్ (RRR) లాంటి సినిమాలతో గ్రాఫిక్స్ ని భారీగా వాడుకున్న రాజమౌళి ఈ సినిమాలో సైతం గ్రాఫిక్స్ ను భారీ విజువల్ వండర్ గా తెరకెక్కించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
Also Read: ఎన్టీఆర్ కి ఏమైంది అసలు..? ఇలా అయిపోయాడేంటి!
మరి ప్రపంచ సినిమా ప్రేక్షకులు హాలీవుడ్ లో విజువల్ వండర్స్ ని చూస్తూ ఉంటారు. మరి వాళ్ళని రాజమౌళి ఎలా మెప్పిస్తాడు అనేదే ఇప్పుడు చర్చనియంశంగా మారింది. ఇక దానికి తగ్గట్టుగా ఇందులో ఏవైనా సన్నివేశాలను పొందుపరుస్తాడా?అలాగే భారీ రేంజ్ లో సన్నివేశాలను చూపించగలుగుతాడా? లేదా అనేదే తెలియాల్సి ఉంది…