మెగా అభిమానులకు చిరు సర్ ప్రైజ్ వీడియో

లాక్ డౌన్ సమయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఫ్యామెలీతో గడుపుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోకి అడుపెట్టిన చిరు ఎప్పుడు యాక్టివ్ ఉంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈమేరకు నిన్న అభిమానులకు ఇటీవల ఓ పాట తరుచూ వింటున్నాను.. మళ్లీ పాజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాను.. దీనికి కారణంగా రేపు చేపుతానంటూ ట్వీటర్లో ట్వీట్ చేశారు. అన్నట్లుగానే మెగాస్టార్ మంగళవారం ఉదయం తన ట్వీటర్లో ఓ సర్ ప్రైజ్ వీడియో ట్వీట్ చేశారు. ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి తన […]

Written By: Neelambaram, Updated On : April 30, 2020 4:51 pm
Follow us on


లాక్ డౌన్ సమయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఫ్యామెలీతో గడుపుతున్నారు. ఇటీవల సోషల్ మీడియాలోకి అడుపెట్టిన చిరు ఎప్పుడు యాక్టివ్ ఉంటూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఈమేరకు నిన్న అభిమానులకు ఇటీవల ఓ పాట తరుచూ వింటున్నాను.. మళ్లీ పాజ్ చేసి ఎంజాయ్ చేస్తున్నాను.. దీనికి కారణంగా రేపు చేపుతానంటూ ట్వీటర్లో ట్వీట్ చేశారు. అన్నట్లుగానే మెగాస్టార్ మంగళవారం ఉదయం తన ట్వీటర్లో ఓ సర్ ప్రైజ్ వీడియో ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి తన మనువరాలు నవిష్కతో కన్పించారు. చిరు తన ఒళ్లో మనువరాలిని కూర్చోబెట్టుకొని తనకు ఏ పాట కావాలని అడుగగా ‘మిమ్మీ’ అంటూ సమాధానమిచ్చింది. దీంతో చిరు ఎప్పుడూ ఆ పాటేనా.. మరో పాట విందాం అంటాడు.. దీనికి చిరు మనువరాలు బుంగమూతిపెట్టి ఏడుపు ప్రారంభించింది. చిరు వెంటనే మనువరాలిని సముదాయించి ఖైదీ-150 మూవీలోని ‘మిమ్మీ’ పాటను ప్లే చేశారు. దీంతో ఆ చిన్నారి హుషారుగా కేరింతలు వేయడం కన్పించింది. మధ్య మధ్య పాటను పాజ్ చేస్తూ నవిష్కను చిరు ఆట పట్టించాడు. నవిష్క చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ-కల్యాణ్ దేవ్ దంపతుల కూతురు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.