ఇవి కూడా కరోనా లక్షణాలు?

విపరీతమైన కడుపుమంట, గుండె సంబంధిత వ్యాధులు, రక్త నాళాల్లో వాపు వంటి లక్షణాలు కూడా కరోనా వ్యాధికి సంబంధించిన లక్షణాలే అని వైద్యులు వెల్లడిస్తున్నారు. బ్రిటన్ లోని కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు బయటపడటం కలవరపేడుతున్నాయి. వివరాల్లోకి వెళ్తే .. ఒకవైపు కరోనా విజృంభణతో బ్రిటన్‌ అతలాకుతలం అవుతుంది, మరోవైపు ఆ దేశం చిన్నారుల్లో అంతుపట్టిన అనారోగ్య సమస్యలను వెంటాడుతున్నాయి. గత మూడు రోజులుగా దాదాపు ఒకే లక్షణాలున్న వందలాది మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. […]

Written By: Neelambaram, Updated On : April 28, 2020 12:43 pm
Follow us on

విపరీతమైన కడుపుమంట, గుండె సంబంధిత వ్యాధులు, రక్త నాళాల్లో వాపు వంటి లక్షణాలు కూడా కరోనా వ్యాధికి సంబంధించిన లక్షణాలే అని వైద్యులు వెల్లడిస్తున్నారు. బ్రిటన్ లోని కొన్ని ప్రాంతాల్లో చిన్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు బయటపడటం కలవరపేడుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే .. ఒకవైపు కరోనా విజృంభణతో బ్రిటన్‌ అతలాకుతలం అవుతుంది, మరోవైపు ఆ దేశం చిన్నారుల్లో అంతుపట్టిన అనారోగ్య సమస్యలను వెంటాడుతున్నాయి. గత మూడు రోజులుగా దాదాపు ఒకే లక్షణాలున్న వందలాది మంది చిన్నారులు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. విపరీతమైన కడుపుమంట, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇవి కూడా కరోనా లక్షణాలంటూ కొంతమంది వైద్యులు భావిస్తున్నప్పటికీ.. వైరస్‌ బారినపడిన బాధితుల్లో కూడా ఇలాంటి లక్షణాలు కనిపించడం కలకలం రేపుతోంది.

ఆ దేశ పిల్లల్లో రక్త నాళాల్లో వాపు కనిపించే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన బ్రిటన్‌ ప్రభుత్వం పిల్లలు అనారోగ్యానికి గురైతే వెంటనే సమీప ఆస్పత్రుల్లో చేర్పించాలని తెలిపింది. అనుమానితులను వెంటనే గుర్తించి ఐసీయూల్లో ఉంచి చికిత్స అందించాలని ప్రభుత్వం ఆరోగ్య విభాగాన్ని ఆదేశించింది.

బ్రిటన్‌ లో నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,569కి చేరుకోగా.. 24 వేలకు పైగా బాధితులు మృత్యువాత పడ్డారు.