Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో పెను ప్రభంజనాలను క్రియేట్ చేయడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక జత్తుగా మారబోతున్నాయి. 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే చిరంజీవికి సినిమా అంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు… ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో పెను రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు సాగేవి. ఒకవేళ ఫ్లాప్ సినిమాలు వచ్చినప్పటికి వాటి కలెక్షన్స్ సైతం హిట్ సినిమాలతో పోటీ పడుతూ ఉండేవి. అలాంటి ఒక మేనియా ను క్రియేట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం భారీ సక్సెస్ ని సాధించాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటివరకు అడపాదడపా సక్సెస్ లను సాధిస్తూ వస్తున్న ఆయన ఇప్పుడు రాబోయే సినిమాలతో పెను ప్రభంజనాలను క్రియేట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు… ఇక మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) సైతం చాలా తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగాడు.
Also Read : నేడు ఈడీ విచారణకు హాజరు కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఎవ్వరికి లేనటువంటి ఒక డిఫరెంట్ స్టైల్ ని ప్రేక్షకులకు పరిచయం చేసి వాళ్ళందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. మరి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి నచ్చిన సినిమా ఏది అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విపరీతమైన చర్చలైతే నడుస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ ఒకానొక సందర్భంలో చిరంజీవి నటించిన ప్రతి సినిమా తనకు ఇష్టమని చెప్పాడు. అయితే మీకు బాగా నచ్చిన సినిమా పేరు ఏదైనా చెప్పండి అని రిపోర్టర్ అడగడంతో తనకి గ్యాంగ్ లీడర్ (Gang Leader) అంటే చాలా ఇష్టమని ఈ సినిమాలో చిరంజీవి తన కుటుంబం కోసం పడే వేదన ఆయన వాళ్లందర్నీ కలపాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన హీరోగా తన పూర్తి పొటెన్షియాలిటీ ఏంటో చూపించాడు అంటూ పవన్ కళ్యాణ్ చిరంజీవి గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. ఇక చిరంజీవి సినిమాల్లో ఆల్ టైం ఫేవరెట్ సినిమా గా గ్యాంగ్ లీడర్ సినిమా మిగిలిపోతుందని చెబుతూ ఉండటం విశేషం.
Also Read : బాలయ్య చేయాల్సిన సినిమాను చిరంజీవి ఎందుకు చేశాడు..?