Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi: 'లెనిన్' పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..నాగార్జున రియాక్షన్ అదుర్స్..

Chiranjeevi: ‘లెనిన్’ పై మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్..నాగార్జున రియాక్షన్ అదుర్స్..

Chiranjeevi: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్ వసూళ్లు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చాయి, అదే ఊపుని ఈ చిత్రం వీకెండ్ వరకు కొనసాగించి సెన్సేషన్ సృష్టించింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ […]

Chiranjeevi: అక్కినేని అఖిల్ ‘లెనిన్’ చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సెన్సేషనల్ రెస్పాన్స్ ని సొంతం చేసుకొని , బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓపెనింగ్ వసూళ్లు ఎవ్వరూ ఊహించని రేంజ్ లో వచ్చాయి, అదే ఊపుని ఈ చిత్రం వీకెండ్ వరకు కొనసాగించి సెన్సేషన్ సృష్టించింది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా, ఫుల్ రన్ లో కచ్చితంగా 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబడుతుందని బలమైన నమ్మకం వ్యక్తం చేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ సినిమా విజయంపై కాసేపటి క్రితమే మెగాస్టార్ చిరంజీవి ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్ లో అక్కినేని అఖిల్ పై ఆయనకు ఉన్న ప్రేమ స్పష్టంగా కనిపిస్తోంది.

చిరంజీవి మాట్లాడుతూ ‘ లెనిన్ మూవీ గురించి చాలా అద్భుతమైన విషయాలను వింటున్నాను. ముఖ్యంగా అఖిల్ పెర్ఫార్మన్స్ ని అందరూ ఒక రేంజ్ లో మెచ్చుకుంటున్నారు. అఖిల్ నా మనసుకి బాగా దగ్గరైన వాడు , నాకు మరో కొడుకు లాంటోడు , సినిమా సినిమాకు అతను ఎదుగుతున్న తీరుని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా నా స్నేహితుడు నాగార్జున కి , మూవీ టీం కి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. త్వరలోనే లెనిన్ చిత్రాన్ని చూడబోతున్నాను. ఈ సినిమా రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద రేంజ్ కి వెళ్లాలని కోరుకుంటున్నాను’ అంటూ చిరంజీవి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనికి నాగార్జున రెస్పాన్స్ ఇస్తూ ‘ధన్యవాదాలు చిరంజీవి గారు. మీరు నాపై , మా కుటుంబం పై ఎల్లపుడు చూపించే అభిమానం , సపోర్ట్ మరువలేనిది, ఈ సినిమాని చూడండి, కచ్చితంగా మీకు బాగా నచ్చుతుంది’ అంటూ నాగార్జున రిప్లై ఇచ్చారు.

వీళ్లిద్దరి మధ్య ఈ రిలేషన్ ని చూసి ఇప్పుడు సోషల్ మీడియా లో మెగా , అక్కినేని అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. చిరంజీవి , నాగార్జున మధ్య ఈ బంధం ఈనాటిది కాదు , ఎన్నో దశాబ్దాల నుండి వీళ్లిద్దరు అన్నదమ్ములు లాగానే కలిసి మెలిసి ఉంటున్నారు. ఎన్నో సందర్భాల్లో చిరంజీవి అక్కినేని ఈవెంట్స్ కి వచ్చారు. నాగార్జున గత చిత్రం ‘కుబేర’ సక్సెస్ మీట్ కి కూడా చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొని , ఆ సినిమా విజయం పై తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు అక్కినేని అఖిల్ ‘లెనిన్’ పైన కూడా తన ఆనందాన్ని అదే స్థాయిలో పంచుకున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత విజయోత్సవ సభకు చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తారో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper