Chiranjeevi : పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదం లో చిక్కుకొని గాయాలపాలైన సంగతి తెలిసిందే. ఏడేళ్ల వయస్సు ఉన్న బిడ్డకు ఇలాంటి ప్రమాదం జరగడంతో అందరూ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించి, మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రార్థించారు. సోషల్ మీడియా లో , ఎలక్ట్రానిక్ మీడియా లో ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఎట్టకేలకు డాక్టర్ల సహకారం తో మార్క్ శంకర్ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి మామూలు స్థితికి వచ్చేసింది. ఈ విషయాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపాడు. దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : పవన్ కళ్యాణ్ చేసిన మంచినే కొడుకు ప్రాణాలను కాపాడిందా?
ఆయన మాట్లాడుతూ ‘మా బిడ్డ మార్క్ శంకర్(Mark Shankar) ఇంటికి తిరిగి వచ్చేశాడు. కానీ ఇంకా పూర్తిగా కోలుకోవాల్సిన అవసరం ఉంది. మా కుల దైవమైన ఆంజనేయ స్వామి కృపతో, త్వరలోనే అతను పూర్తి ఆరోగ్యంతో , ఎప్పటిలాగానే ఉంటాడు. రేపు హనుమాన్ జయంతి. ఈ సందర్భంగా ఆ స్వామి మా కుటుంబాన్ని అతి పెద్ద విపత్తు నుండి రక్షించి ఈ పసి బిడ్డకు పునర్జన్మని ఇచ్చాడు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆయా ఊర్లల్లో, గ్రామాల్లో మా బిడ్డ ఆరోగ్యం తో బయటపడాలని ప్రార్థనలు చేసిన ప్రతీ ఒక్క అభిమాని కి పేరు పేరున నా తరుపున, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ తరుపున కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ ఆశీస్సులు మా బిడ్డలపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి’ అంటూ చిరంజీవి వేసిన ట్వీట్ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.
మార్క్ శంకర్ క్షేమంగా ఉన్నాడు అనే శుభవార్త ఒకపక్క, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒకే ఫోటో లో చూసాము అనే ఆనందం తో మరోపక్క అభిమానులు సోషల్ మీడియా లో సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. మళ్ళీ మామూలు లుక్స్ లోకి వచ్చేసాడని, ఇక సినిమా షూటింగ్స్ కి సిద్ధం అవుతాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ వారం లో హరి హర వీరమల్లు మూవీ షూటింగ్ ని పూర్తి చెయ్యాలి, డేట్స్ ని కూడా కేటాయించాడు. కానీ అనుకోకుండా ఈ సంఘటన ఎదురైంది. దీంతో ఈ చిత్రం మే9న విడుదల అవుతుందో లేదో అని భయపడ్డారు. వచ్చే వారం లో ఆయన నాలుగు రోజుల పాటు షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొని, డబ్బింగ్ కూడా పూర్తి చేయబోతున్నాడు. రేపటి నుండి ఈ చిత్రం గురించి నాన్ స్టాప్ అప్డేట్స్ రానున్నాయి.
ALso Read : రేపే ఓటీటీలోకి రానున్న ‘చావా’..ఎందులో చూడాలంటే!
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా… pic.twitter.com/nEcWQEj92v
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2025